desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 21 2014 @ 03:55AM

ప్రభుత్వ పథకాలను పేదలకు అందించాలి


ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం
ఒంగోలు కలెక్టరేట్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్ర తిష్ఠాత్మకంగా అమలు చేసే పథకాలను పే దలకు అందించే విధంగా అధికార యం త్రాంగం పాటుపడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశిం చారు. హైద రాబాద్‌ నుంచి శనివారం జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, డివిజనల్‌, మండల స్థాయి అధికారులు, సర్పంచ్‌లు, డ్వాక్రా మహిళలు, వి విధ శాఖల అధికారులతో జరిగిన వీడియో కా న్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అధికార యం త్రాంగం గ్రామాల్లో పర్యటించి ప్రజలకు సత్వ రమే పథకాలు అందించడంతో పాటు వారి స మస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకో వాలని సూచించారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టి లో పెట్టుకొని ప్రభుత్వం ఏడు మిషన్లను ఏర్పా టుచేసి తద్వారా ప్రజలకు మంచి సేవలు అం దించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అక్టోబరు 2న పలు పథకాలను ప్రారంభిస్తు న్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్‌ విజయకుమార్‌ మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల యూనిట్ల విలువను పెం చేవిధంగా చూడాలని సీఎంను కోరారు. పింఛన్ల సర్వేను పకడ్బందీగా నిర్వహించే విధంగా బృం దాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ సర్వేలో అక్రమాలు జరగకుండా ప్రత్యేక చ ర్యలు తీసుకున్నట్టు సీఎంకు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ యా కూబ్‌ నాయక్‌, జిల్లా రెవెన్యూ అధికారి గంగా ధర్‌ గౌడ్‌, సీపీవో మూర్తి, డీఆర్‌డీఏ పీడీ ప ద్మజ, డ్వామా పీడీ పోలప్ప, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రెవె న్యూ డివిజన్‌ కార్యాలయాల్లో ఆర్డీవోలు, తహ సీల్దార్‌ కార్యాలయాల్లో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు, డ్వాక్రా సంఘాల సభ్యులు ఈ వీడియో కాన్ఫ రెన్స్‌లో పాల్గొన్నారు.