Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 21 2014 @ 03:16AM

ఆరోపణలపై డీపీవో విచారణ



రామచంద్రాపురం: రామచంద్రాపురం మండలంలోని ఉస్మాన్‌నగర్‌ గ్రామపంచాయ తీ నిధులను దుర్వినియోగం చేశారన్న ఫిర్యాదుపై శనివారం డీపీవో ప్రభాకర్‌రెడ్డి విచారణ చేపట్టారు. పంచాయతీ రికార్డులను సీజ్‌చేసి తీసుకువెళ్లారు. వివరాలు ఇలావున్నాయి. ఉ స్మాన్‌నగర్‌ సర్పంచ్‌ రూ.81 లక్షల నిధులను పంచాయతీ నిబంధనలకు విరుద్ధంగా అభివృద్ధి పనులకు వెచ్చించారని వార్డు సభ్యులు ల క్ష్మీనారాయణ, యాదయ్య, నాయకులు ఉమే శ్వర్‌, ప్రేమ్‌కుమార్‌, రాజు, శంకర్‌లు గత నెల 25వ తేదీన డీపీవో ప్రభాకర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈమేరకు పంచాయతీ కార్యాలయం లో విచారణ చేపట్టిన ఆయన సర్పంచ్‌ కల్పన, ఫిర్యాదుదారుల వాంగ్మూలాన్ని తీసుకున్నారు. రికార్డులను సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ సర్పంచులు జీవో నంబరు 432 ప్రకారం నిధులను వినియోగిస్తే ఎటువంటి సమస్యలు రావని తెలిపారు. ఉస్మాన్‌నగర్‌ గ్రామ పంచాయతీకి సంబంధించి పూర్తి విచారణ చేపట్టి నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందిస్తామని ఆయన తెలిపారు.
గెలిచిన కొత్తలోనే సంతకాలు చేశాం...
గెలిచిన కొత్తలోనే సంతకాలు తీసుకున్నారని ఫిర్యాదు చేసిన వార్డు సభ్యుల్లో ఒకరైన లక్ష్మీనారాయణ తెలిపారు. వార్డు సభ్యుడినైన తనకు ఇంతవరకు ఒక్క కాంట్రాక్టు కూడా ఇవ్వలేదని డీపీవో ముందు వాపోయారు. సర్పంచ్‌కు ఏమీ తెలియదని ఉప సర్పంచ్‌ అంతాచేస్తున్నారని ఆయన ఆరోపించారు.
మహిళను కాబట్టే అవమానిస్తున్నారు
అయిదు సంవత్సరాలు వార్డు సభ్యురాలిగా గ్రామానికి సేవచేసిన తరువాత తనకు సర్పంచ్‌గా అవకాశం వచ్చిందని సర్పంచ్‌ కల్పన శ్రీనివాస్‌ తెలిపారు. తనకు ఏమీ తెలియదని చెప్పడంలోనే తనను అవమానిస్తున్నారన్న విషయం స్పష్టమైందన్నారు. మహిళనైనందుకే ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. అవినీతికి పాల్పడవలసిన అవసరం తనకు లేదన్నారు. గ్రామంలో ప్రతి అభివృద్ధి పనిని నిబంధనల ప్రకారమే చేపట్టామని సర్పంచ్‌ స్పష్టం చేశారు.
అనంతరం.. మాజీ సర్పంచ్‌ డీ.రామ్మోహన్‌రెడ్డి హయాంలో జరిగిన అవినీతిపై విచారణచేపట్టాలని డీపీవోకు వినతి పత్రాన్ని సమర్పించారు. కాగా, విచారణకు తాము మద్దతు తెలుపుతున్నట్టు ఫిర్యాదుదారులు ఉమేశ్వర్‌, ప్రేమ్‌కుమార్‌ తెలిపారు.