Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 21 2014 @ 03:09AM

చెరువులు, కుంటల వివరాల సేకరణ


నర్సాపూర్‌: నర్సాపూర్‌ మండలంలో చెరువులు, కుంటల సమగ్ర సమాచారం కోసం అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి గ్రామగ్రామాన తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటల వివరాలు, వాటి ప్రస్తుత పరిస్థితిని సేకరించాలని ఉన్న తాధికారులు ఆదేశాలు జారీచేశారు. దీంతో రెండురోజులుగా నర్సాపూర్‌ మండలంలో తహసీల్దార్‌, ఎంపీడీవో, ఏవో, పీఆర్‌ ఏఈ, ఐబీ ఏఈ అధికారుల ఆధ్వర్యంలో ఐదు బృందాలుగా ఏర్పడి వివరాలు సేకరిస్తున్నారు. శనివారం మండలంలో జరుగుతున్న తీరును మెదక్‌ ఆర్డీవో వనజాదేవి తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ బృందాలు గ్రామాలను పర్యటించి చెరువులు, కుంటల వివరాలు, వాటి పరిధిలో ఆయకట్టుతోపాటు ఏవైనా ఆక్రమణకు గురయ్యాయా అనే అంశాలను క్షుణంగా పరిశీలించి నివేదికను రెండురోజులలో ఉన్నతాదికారులకు ఇవ్వాల్సి ఉండటంతో అధికారులు తమ పనిలో నిమగ్నమయ్యారు. అయితే కొన్ని గ్రామాలలో గతంలో ఉన్న చెరువులు, కుంటలు ఉన్నట్లు రికార్డులలో ఉన్నా ప్రస్తుతం వాటి ఉనికి లేకుండా పోయింది. వాటి వివరాలను కూడా సేకరిస్తున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. ఏదిఏమైనా అధికారులు చెరువులు, కుంటలపై ఆరా తీస్తుండటంతో ఆక్రమణ చేసినవారిలో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం ఆక్రమించినవారిపై ఏవైనా చర్యలు తీసుకుంటుందా అనే భయం వారిలో వ్యక్తం అవుతోంది.
తూప్రాన్‌లో..
తూప్రాన్‌: తూప్రాన్‌ మండలంలోని కుంటలు, చెరువుల వివరాలు శనివారం సేకరించేందుకు సర్వే మొదలెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తూప్రాన్‌ మండలంలో అధికారులు తొమ్మిది బృందాలుగా గ్రామాలకు వెళ్లి కుంటలు, చెరువుల సర్వే పనులు చేపట్టారు. తూప్రాన్‌ మండలంలో ఉన్న 220 కుంటలు, చెరువులను సర్వే చేసేందుకు తహసీల్దార్‌ జే.స్వామి, ఎంపీడీవో డి.కరుణశీల, పంచాయతీరాజ్‌ ఏఈ రమణారెడ్డి, ఇరిగేషన్‌ ఏఈ చక్రవర్తి, డిప్యూటీ తహసీల్దారు కిషన్‌, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీవో అనిల్‌కుమార్‌, ఇందిరా క్రాంతిపథం ఏపీఎం యాదగిరి, వ్యవసాయశాఖ అధికారి రాజశేఖర్‌లు 9 బృందాలుగా ఏర్పడి సర్వే చేపట్టారు. సర్వేలో చెరువు, కుంటల సమగ్ర సమాచారం సేకరిస్తున్నట్లు తహసీల్దారు స్వామి తెలిపారు.
గజ్వేల్‌లో..
గజ్వేల్‌అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం చెరువులు, కుంటల సర్వేను నిర్వహించనున్న నేపథ్యంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల్లోని చెరువులు, కుంటలను అధికారుల బృందం శనివారం పరి శీలించింది. మండలంలోని తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీ వో, వ్యవసాయశాఖాఽదికారి నాలుగు బృందాలుగా విడిపోయి మండల పరిఽదిలోని వివిధ గ్రామాల్లోని చెరువులు, కుంటలను పరిశీలించారు. వారి పరిశీలనలో వివిధ గ్రామాల్లో గల చెరువులు, కుంటలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. చెరువులు, కుంటల స్థితిగతులపై ప్రభుత్వానికి ప్రస్తుత పరిస్థితులను నివేదిక రూపంలో సమర్పించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సర్వే చేపట్టనున్నట్లు తెలిసింది.
సంగారెడ్డిలో..
సంగారెడ్డి రూరల్‌ : శనివారం సంగారెడ్డి మండలంలో చెరువులు, కుంటల సర్వే చేపట్టారు. మండలంలో మొత్తం 27 గ్రామ పంచాయతీలున్నాయి. వాటి పరిఽధిలో ఎన్ని చెరువులు, కుంటలు న్నాయి, వాటికింద ఎన్ని ఎకరాల భూమి సాగవుతుందున్న వివరాలను అధికారులు సేకరిస్తున్నా రు. అలాగే, గ్రామాల పరిధిలో చెక్‌ డ్యామ్‌ల వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. శనివారం పీఆర్‌ శాఖ అధికారులు మండలంలోని కోత్లాపూర్‌, మక్త అల్లూర్‌, ఉత్తర్‌పల్లి గ్రామాల్లో పర్యటించి చెరువుల, కుంటల వివరాలను సేకరించారు. కొత్లాపూర్‌లో వంద ఎకరాలు సాగయ్యే టిన్నయ్య చెరువు, 5 కుంటలు, 5 చెక్‌డ్యాంలున్నాయి. మక్తఅల్లూర్‌లో చెరువులు లేకపోయినా 2 కుంటలు, 7 చెక్‌డ్యామ్‌లున్నాయి. అలాగే, ఉత్తర్‌పల్లిలో ఒక కుంట, 9 చెక్‌ డ్యామ్‌లున్నాయి. కుంటల కింద 20 నుంచి 30 ఎకరాల వరకు పంటలసాగు జరుగుతున్నట్టుగా అధికారులు తెలిపారు.
మిరుదొడ్డిలో..
మిరుదొడ్డి: మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో 130 చెరువులు, కుంటలను శనివారం అధికారులు గుర్తించారు. ప్రభుత్వం చెరువులు, కుంటల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపడంతో శనివారం మండల అధికారులు వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో నగేశ్‌, ఇన్‌చార్జి తహసీల్దార్‌ ఉమారాణి తదితరులుపాల్గొన్నారు.