Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 21 2014 @ 02:47AM

అక్టోబర్‌ 2 నుంచి 20 వరకు జన్మభూమి, మా ఊరు కార్యక్రమాలు

కోవెలకుంట్ల: అక్టోబర్‌ 2 నుంచి 20 వరకు జన్మభూమి, మా ఊరు కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులకు శనివారం సూచనలు ఇచ్చారు. కోవెలకుంట్ల తహసీల్దా రు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లో కోవెలకుంట్ల, బనగానపల్లె, సంజామల, దొర్నిపాడు అఽధికారులు పాల్గొన్నారు. గ్రామాలను బ ట్టి ఉదయం సాయంత్రం షెడ్యూల్‌ తయారు చేసుకోవాలని సూచించారు. అక్టోబర్‌ 2 నుంచి వృద్ధులు, వితంతువులకు రూ.200 నుంచి రూ.1000 వరకు వికలాంగుకులకు రూ.500 నుంచి రూ.1500 పెంచుతున్నట్లు తెలిపారు. పింఛన్లతో ఆధార్‌ ఫిడింగ్‌ చేయించాలన్నారు. గ్రామాల్లో హెల్త్‌ క్యాంప్‌లు నిర్వహించాలన్నా రు. ఎన్‌టీఆర్‌ ఆరోగ్య సేవ క్రింద రూ.2.50లక్ష లు వైద్యానికి కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప శువైద్య శిబిరాలను నిర్వహించాలని సూచించా రు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుంటే రూ.15వేలు అందిస్తామన్నారు. అంటువ్యాధు లు ప్రబలకుండా పరిశుభ్రత పాటించాలన్నా రు. 15 రోజులకు ఓసారి వోహెచ్‌ఆర్‌ ట్యాం కులను శుభ్రం చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో కోవెలకుంట్ల, బ నగానపల్లె, సంజామల తహసీల్దారులు సుధాకర్‌, శేషుఫణి, మోజెస్‌ ప్రసన్న డీఎల్‌పీవో పార్వతి, ఎంపీడీవోలు సుజాత, వెంగన్న, రమణమూర్తి, సీడీపీవో విజయలక్ష్మి, ఎంఈవోలు గురుస్వామి, వీరారెడ్డి, సుబ్బారెడ్డి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
బేతంచెర్లలో:
జన్మభూమి, మా ఊరు ప్రభుత్వ కార్యక్రమా లు విజయవంతం చేయాలని అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అఽధికారులకు సూచించారు. శనివారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో విడియో కా న్ఫరెన్స్‌ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా అధికారులు కృషి చేయాలని సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు రామకృష్ణుడు, ఎంపీడీవో ప్రతాప్‌రెడ్డి, ఈవోఆర్డీ అజయ్‌భాస్కర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ వెంకటరాముడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఒ్శ్ఠ్న్ఢశ్రీజ