Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 21 2014 @ 01:56AM

మట్కా ఏజెంట్‌ అరెస్టు

కరీంనగర్‌ క్రైం: కరీంనగర్‌లోని వివిధ ప్రాంతాల్లో మట్కా స్థావరాలపై పోలీసులు దాడులను ముమ్మరం చేశారు. కరీంనగర్‌లోని కార్ఖానగడ్డ ప్రాం తంలో మట్కా జూదం నిర్వహిస్తున్న స్థావరంపై కరీంనగర్‌ మూడవ ఠాణా పోలీసులు దాడిచేసి ఏజెంట్‌ ఎండీ ఖలీల్‌ ను అరెస్టు చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మూడవ ఠాణా సీఐ టీ స్వామి వివరాలు వెల్లడించారు. కరీంనగర్‌లోని కార్ఖానగడ్డ ప్రాంతానికి చెందిన ఎండీ ఖలీం చాలా కాలంగా మట్కా నిర్వహిస్తున్నాడని, మట్కా జూదం ఆడేందుకు వచ్చిన వారికి గంజాయిని విక్రయిస్తున్నట్లు సీఐ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మట్కా నిర్వహిస్తున్న కేంద్రాలపై శుక్రవారం సాయంత్రం దాడులు నిర్వహించగా ఎండీ ఖలీం పట్టుబడినట్లు తెలిపారు. కార్ఖానగడ్డలోని ఎండీ ఖలీం ఇంటి వద్ద తనిఖీలు చేయగా ఒక కిలో గంజాయిని, మట్కా జూదంకు సంబంధించిన చిట్టీలతో పాటు 2 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఖలీంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తు న్నట్లు తెలిపారు. కరీంనగర్‌లో మట్కా ఏజెంట్లు, జూదరులు, పేకా టరాయుళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. మట్కా, పేకాటకు సం బంధించిన సమాచారాన్ని ప్రజలు నేరుగా పోలీసులకు అందించాలని కోరారు. జటఔగీజటఔఈజటఈ