Sep 21 2014 @ 01:46AM

వైఎస్సార్‌ కాలనీ సమస్యలు పరిష్కరిస్తా : ఎమ్మెల్యే

మదనపల్లెరూరల్‌: మదనపల్లె మండలంలోని కోళ్లబైలు, వైఎస్సార్‌ కాలనీ సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం వైఎస్సార్‌ కాలనీ మహిళలు ఎమ్మెల్యేను కలసి సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్‌ కాలనీ, ఎగువ ఇందిరమ్మ కాలనీల మధ్య హౌసింగ్‌ అధికారులు బోరు వేసి తాగునీరు సరఫరా చేస్తున్నారన్నారు. కానీ ఎగువ ఇందిరమ్మ కాలనీవాసులు బోరు నీటిని వైఎస్సార్‌ కాలనీకి వదలకుండా అడ్డుకుంటున్నారన్నారు. అంతేకాక కాలనీలో వీధి దీపాలు లేకపోవడంతో పాములు, విషపురుగుల భయం ఎక్కువగా ఉందన్నారు. ఎగుడు, దిగుడు రోడ్లు వుండటంతో వృద్ధులు, చిన్నారులు కిందపడి దెబ్బలు తగిలించుకుంటున్నారని వాపోయారు. దీంతో ఎమ్మెల్యే స్పందిస్తూ హౌసింగ్‌ అధికారులకు ఫోన్‌ చేసి బోరునుంచి సరఫరా అయ్యే తాగునీటికి రోజుమార్చి రోజు రెండు కాలనీలకు సరఫరా చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం, వీధిదీపాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, కలెక్టర్‌తో చర్చించి నిధులు మంజూరుకు కృషి చేస్తానన్నారు.కజ4ఔఇ్చ4ఔఇఠీ4ఔఎూ4ఔఇఠి4ఔఇతిబరఐౌ