Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 21 2014 @ 01:43AM

ఎన్జీవో సంఘంలో రూ.30 లక్షల గోల్‌మాల్‌..?

అనంతపురం: ఏపీఎన్జీవో కార్యాలయానికి సంబంధించిన రూ. 30 లక్షలకు పైగా దుర్వినియోగమైనట్లు రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబుకు ఫిర్యాదు అందినట్లు సమాచారం. ప్రాథమిక పరిశీలన అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా కమిటీని విచారించేందుకు ఉన్నతస్థాయి సం ఘాన్ని నియమించినట్లు భోగట్టా. అనంతపు రం నగర, జిల్లా శాఖ పరిధిలో గత ఆరేళ్లుగా దుర్వినియోగ తతంగం యథేచ్ఛగా కొనసాగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ తతంగంలో ఎన్జీవో నాయకుడు ప్రధాన భూమిక పోషించినట్లు తెలిసింది. కొంతమంది ఎన్జీవో నాయకులు రాష్ట్ర నాయకుడికి ఫిర్యాదు చేయడంతో భాగోతం బహిరంగమైంది. ప్రాథమిక అవగాహనకు వచ్చిన ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు విచారణకు ఒకట్రెండు రోజుల్లో జిల్లాకు కమిటీను పంపనున్నట్లు తెలిసింది. జిల్లా ఎన్జీవో సం ఘం కార్యాలయ పరిధిలోని దుకాణాల బాడుగలు, ఉద్యోగుల సభ్యత్వం రూపంలో ఏటా లక్షలాది రూపాయలు సంఘం ఖాతాలో జమ వుతుంటాయి. లెక్కలను ఏటా జిల్లా సచివాలయం, ఎగ్జిక్యూటివ్‌ కమిటీలకు సమర్పించి ఆ మోదం పొందాల్సి ఉంటుంది. వీటిని ఆడిటర్‌ ద్వారా కూడా ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఎవ రి అనుమతులు, ఆమోదాలు లేకుండానే ని బంధనలకు విరుద్దంగా ఇష్టారాజ్యంగా సం ఘం సొమ్ము ఖర్చుపెట్టినట్లు బలమైన ఆరోపణలున్నాయి. నగర నడిబొడ్డున ఉన్న ఎన్జీవో దుకాణాల నుంచి అధిక బాడుగలు వస్తున్నా వాటిని తక్కువగా లెక్కల్లో చూపడమే కా కుండా వసూలైన సొమ్ము మింగేస్తున్నట్లు పలువురు ఉద్యోగులు బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ముందుండాల్సిన సంఘం స్వలాభపేక్ష కోసం అధికారులకు తొత్తులుగా మారి ఉద్యో గులకు అన్యాయాలు జరిగినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. నగర, జిల్లా ఎన్జీవో కమిటీలలో కూడా అక్రమాలు ముమ్మరంగా జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఉద్యోగులకు అన్యా యం జరిగినపుడు పట్టించుకోవడంలో నిర్ల క్ష్యం చేస్తూ సొమ్మును దిగమింగడమే లక్ష్యం గా పెట్టుకొని సంఘంలో కొందరు కొనసాగుతున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
జిల్లా ఎన్జీవో సంఘంలో జరిగిన రూ.30 లక్షల అవినీతి భాగోతంపై విచారించేందుకు రాష్ట్ర ఎన్జీవో కమిటీ ఆదివారం అనంతపురం రానున్నట్లు తెలిసింది. జిల్లాలోని ఎన్జీవో నాయకులందరినీ కలసి అక్రమాలపై ఆరా తీయనున్నట్లు తెలిసింది. రాష్ట్ర ఎన్జీవో సం ఘం కోశాధికారి వీరేంద్రబాబు, ఎన్జీవో నాయకులు గంగిరెడ్డి ఆదివారం ఉదయం ఎన్జీవో హోమ్‌లో సభ్యులతో సమావేశం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం.శలి9ెఅ×ఆ