Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 21 2014 @ 01:41AM

కొడి‘కొండ..!’

చిలమత్తూరు: మండలంలో సెంట్రల్‌ క స్టమ్స్‌, ఎక్సైజ్‌ అకాడమీ ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 44వ జాతీయ రహదారికి అనుబంధంగా ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులోని ఈ ప్రదేశం అ కాడమీ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుంద ని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ ప్రదేశం కేవలం 70కి.మీ., దూరంలో ఉం డటంతో రాకపోకలకు అనుకూలంగా ఉంటుందని వారు భావిస్తున్నారు. ఇక్కడున్న చల్లటి, ప్రశాంత వాతావరణం బాగా ఆకట్టుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వం స్థలం సమకూర్చి, మౌలి క వసతులు కల్పిస్తే మండలంలో సెంట్రల్‌ ఎక్సైజ్‌ అకాడమీ ఏర్పాటు చేయడానికిసం బంధిత అధికారులు ఆసక్తి కనబరుస్తున్నారు. స్థలం ఎంపిక విషయంలో అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. మండలంలో ఎక్కడ అ కాడమీ ఏర్పాటు చేయాలనే అంశంపై అధికారులు ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. అకాడమీ డైరెక్టర్‌ జనరల్‌ కుమార్‌మీనన్‌ ఆ ధ్వర్యంలో ఆశాఖ అధికారుల బృందం శనివా రం చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో పర్యటించింది. స్థలం కోసం అన్వేషించింది. చిలమత్తూరు సమీపంలోని ఎర్రకొండ అటవీప్రాం తం నర్సరీ వద్ద జాయింట్‌ కలెక్టర్‌ సత్యనారాయణతో బృందం మాట్లాడుతూ అభిప్రాయాలు వెలిబుచ్చింది. గోరంట్ల మండలం మిషన్‌తండా వద్ద బీఎల్‌ భూములు అకాడమీ ఏ ర్పాటుకు అనుకూలంగా లేవని అధికారులు అభిప్రాయపడినట్లు సమాచారం. అవి విమానాశ్రాయానికి దూరంగా ఉన్నాయని విముఖత తెలిపినట్లు తెలిసింది. రాష్ట్ర సరిహద్దుకు ఆనుకుని ఉన్న లేపాక్షి హబ్‌ భూములైతే అనుకూలంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.వివాదాస్పదమైన హబ్‌ భూములు కేటాయించడానికి వీలుకాదని జేసీ స్పష్టం చేశారు. కం బాలపల్లి క్రాస్‌ వద్ద ఉన్న బీడీఎల్‌ భూముల ను కేటాయిస్తామనారు. అందుకు ఎలాంటి అ డ్డంకులూ ఉండవన్నారు. జేసీ ప్రతిపాదనప ట్ల వారు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. కొడికొండ చెక్‌పోస్టులోని రక్షా అకాడమీ భూములను కేటాయిస్తే బాగుంటుందని కొందరు క స్టమ్స్‌ అధికారులు అభిప్రాయపడ్డారు. రక్షా అ కాడమీ భూములను కొనుగోలు, చేసి అక్కడు న్న భవనాలను యథాతథంగా ఉపయోగించుకుంటే సరిపోతుందన్నారు. అనంతరం వా రు ఎర్రకొండ అటవీ భూములపై చర్చించా రు. 500 నుంచి వెయ్యి ఎకరాల వరకు అక్క డ అందుబాటులో ఉందని జేసీ తెలిపారు. అక్కడ భూసేకరణ ప్రక్రియ పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందని కస్టమ్స్‌ అధికారులు జేసీని ప్రశ్నించారు. అటవీ భూములైనందున కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందనీ, ఇందుకు 6 నెలల సమ యం పడుతుందని జేసీ సమాధానమిచ్చారు. వారి సంభాషణను బట్టి చిలమత్తూరు, కొడికొండ చెక్‌పోస్టు పరిసరాల్లోనే ఎక్సైజ్‌ అకాడ మీని ఏర్పాటుచేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని అధికారులు ఇంకా ప్రకటించాల్సి ఉంది.
అధికారుల పర్యటన సాగిందిలా...
సెంట్రల్‌ కస్టమ్స్‌ ఎక్సైజ్‌ అకాడమీ డైరెక్టర్‌ జనరల్‌ కుమార్‌ మీనన్‌ ఆధ్వర్యంలో మానవవనరుల అభివృద్ధిశాఖ డైరెక్టర్‌ జనరల్‌ నీరజాశా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ దీపక్‌గార్గే, సెంట్రల్‌ కస్టమ్స్‌ ఎక్సైజ్‌శాఖ చీఫ్‌ కమిషనర్లు దీపాదాస్‌ గుప్తా (వైజాగ్‌), కామేశ్వరీసుబ్ర హ్మణ్యం (బెంగుళూరు), కమిషనర్‌ జగ్గి అరుణ్‌కుమార్‌ (తిరుపతి), వాణీ భట్టాచార్య, పీవీ రావు శనివారం చిలమత్తూరు, గోరంట్ల మం డలాల్లో పర్యటించారు. సెంట్రల్‌ ఎక్సైజ్‌ అ కాడమీ ఏర్పాటుకు అవసరమైన భూముల కో సం అన్వేషించారు. బెంగుళూరు నుంచి శనివారం కారులో ఉదయం రక్షా అకాడమీకి చే రుకున్న అధికారులు అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని, అల్పాహారం తీసుకున్నారు. అక్కడి కి వచ్చిన స్థానిక ఎంపీ నిమ్మల కిష్టప్పతో వా రు కాసేపు మంతనాలు సాగించారు. ఆ తరువాత మండలంలోని కంబాలపల్లి క్రాస్‌ వద్ద గల బీడీఎల్‌ భూములను పరిశీఇంచారు. అ నంతరం గోరంట్ల మండలంలోని మిషన్‌తం డా వద్ద బీఈఎల్‌కు కేటాయించిన భూముల ను పరిశీలించారు. అక్కడినుంచి వెనుదిరిగి చిలమత్తూరు సమీపంలోని ఫారెస్ట్‌ నర్సరీలో ని భూములను పరిశీలించారు. అక్కడ అం దుబాటులో ఉన్న ఎర్రకొండ అటవీ భూముల గురించి జేసీతో చర్చించారు. అనంతరం వారు రాష్ట్ర సరిహద్దుకు ఆనుకుని ఉన్న లేపాక్షి హబ్‌ భూములను పరిశీలించారు. కోడూరు పంచాయతీలోని సుబ్బరావుపేటలో పర్యటిం చారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ రంజీత్‌, హిందూపురం ఏరియా మేనేజర్‌ చంద్రశేఖర్‌, జేసీ సత్యనారాయణ, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ ఇబ్రహీమ్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
గోరంట్ల మండలంలో...
గోరంట్ల రూరల్‌: సెంట్రల్‌ ఎక్సైజ్‌ అకాడ మీ ఏర్పాటుకు గోరంట్ల మండలం బూదిలి, పాలసముద్రం, ప్రాంతాల్లోని సెజ్‌ భూములను అధికారులు, ప్రతినిధులు సందర్శించా రు. మ్యాప్‌లు, రికార్డులను పరిశీలిస్తూ ఇక్కడి పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఆర్‌ఐ విశ్వనాథ్‌, సర్వేయక్‌ కోదండపాణి, వీఆర్‌ఓ కృష్ణకీర్తి, మోహన్‌బాబు పాల్గొన్నారు.,వీ9లి9థఊ