Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 21 2014 @ 01:36AM

23 నుంచి దసరా సెలవులు

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లాలోని ప్రభు త్వ జిల్లా పరిషత్‌, ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 23 నుంచి వచ్చేనెల 5వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాసచారి ఒక ప్రకటనలో తెలిపారు. అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం సెలవులు నిర్ణయించామని, ప్రైవేటు యాజమానులు కూడా వీటిని అమలు చే యాలన్నారు. వచ్చే నెల 6న తిరిగి అన్ని పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని ఆ యన తెలిపారు.