Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 21 2014 @ 01:04AM

వసతిగృహాల్లో సౌకర్యాలు కల్పించాలి

శ్రీకాకుళం అర్బన్‌: జిల్లాలోని అన్ని వసతిగృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్‌ డిమాండ్‌ చేసింది. శనివారం మండలవీధి నుంచి స్థానిక బీసీ బాలికల వసతిగృహం నుంచి విద్యార్థునులతో ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సమస్యలపై నినాదాలు చేశారు. హాస్టళ్లలో వసతులు లేక విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారని...ఉన్నతాధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. మండల వీధిలో బీసీ వసతిగృహంలో చాలీచాలని గదులతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఏబీవీపీ ప్రతినిధులు ఎం.గోపాలపాత్రుడు, బి.నర్శింగరావు, ఎం.కృష్ణంరాజు, కె.అప్పలనాయుడు, పి.రమణ, హేమలత, సమంత, కళ్యాణి, పావని పాల్గొన్నారు.
మెనూ సక్రమంగా పాటించాలి

వసతిగృహాల్లో మెనూ సక్రమంగా పాటించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ గౌరవ్‌ఉప్పల్‌ సిబ్బందికి ఆదేశించారు. కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టిన విద్యార్థుల సమస్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. మండలవీధిలోని బీసీ బాలికల వసతి గృహాన్ని శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 260 మంది ఉన్న హాస్టల్‌లో స్నానపు గదులు, మరుగుదొడ్లు సరిపోవడం లేదని, వర్షం పడితే భవనం కారిపోతుందని విద్యార్థులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ భవనం మార్పు విషయమై రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషనర్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. భవనం మార్పునకు సంబంధించి ప్రతిపాదనలను తక్షణమే తనకు అందించాలని బీసీ సంక్షేమాధికారి కె.లాలాలజపతి రాయ్‌ను ఆదేశించారు. అలాగే విద్యార్థులనుకు అందిస్తున్న మెనును సక్రమంగా పాటించాలని ఆదేశించారు. త్వరలో జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ హాస్టల్‌ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ వెల్లడించారు. ఆయనతోపాటు అదనపు సంయుక్త కలెక్టర్‌ ఎంహెచ్‌ షరీఫ్‌ తదితరులు ఉన్నారు
వసతిగృహ విద్యార్థినుల ధర్నా
శ్రీకాకుళం మండలవీధిలోని వసతిగృహ విద్యార్థినులు రోడ్డెక్కారు. మౌలిక వసతులు కల్పించాలంటూ శనివారం ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్‌ గౌరవ్‌ఉప్పల్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. దీనికి కలెక్టర్‌ స్పందించి వసతిగృహాన్ని సందర్శించారు. విద్యార్థినుల సమస్యలపై ఆరాతీశారు. పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాన్ని మార్పుచేసేందుకు ప్రతిపాదనలు అందజేయాలని బీసీ సంక్షేమాధికారికి ఆదేశించారు.