Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 20 2014 @ 18:24PM

ఆరు నెలల్లో జగన్‌ పార్టీ ఉండదు
ఐదేళ్లలోపు జగన్‌ జైలుకు వెళ్లడం ఖాయం : జేసీ దివాకర్‌రెడ్డి

విజయవాడ, సెప్టెంబర్‌ 20 : ఆరు నెలల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉండదని తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీని వీడబోతున్నారని ఆయన అన్నారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్ళ లోపు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. జగన్‌పై నమోదు అయిన 10కి పైగా కేసుల్లో కనీసం మూడింటిలోనైనా శిక్ష పడడం ఖాయమని జేసీ అన్నారు.
 
జగన్‌ బయట ఉంటేనే వైసీపీలో ఉండని నేతలు జైలుకు వెళితే పార్టీలో ఎలా ఉంటారని జేసీ దివాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నేను చెప్పింది ఇంతవరకు ఏదీ అబద్ధం కాలేదని, కాంగ్రెస్‌ భూ స్థాపితం అవుతుందని చెప్పానని... ఎవరికీ డిపాజిట్‌లు కూడా రావని చెప్పానని... అలాగే జరిగిందని.. నేను జ్యోతిష్యుడిని కాదని, ఉన్న పరిస్థితుల బట్టి చెబుతున్నానని జేసీ వెల్లడించారు.