Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 20 2014 @ 04:48AM

మున్సిపాలిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి


కందుకూరు: కందుకూరు నియోజక వర్గంలోని సమస్యలు, అధికారులు చేపట్టా ల్సిన చర్యలపై ఎమ్మెల్యే పోతుల రామారా వు శుక్రవారం సాయంత్రం సబ్‌ కలెక్టరు అన్నం మల్లిఖార్జునను కలిసి వివరించారు. స్థానిక ఆర్‌ అండ్‌ బి అతిథి గృహంలో సబ్‌ కలెక్టరుని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే నియోజకవర్గంలోని వివిధ సమ స్యలపై చర్చించారు. ప్రధానంగా మునిసి పాలిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమా ల గురించి మాట్లాడిన ఎమ్మెల్యే మునిసి పాలిటీకి ప్రత్యేకాధికారిగా కూడా మీరే వ్యవ హరిస్తున్నందున తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం ద్వారా కందు కూరు మునిసిపాలిటీలో సమగ్ర అభివృద్ధి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరా రు. గతంలో అప్పటి పురపాలక శాఖా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కందుకూరు ముని సిపాలిటీని రాజీవ్‌ ఆవాస్‌ యోజన (ఆర్‌ఏ వై) పథకంలో చేర్పించి జనార్థన కాలనీని ఆదర్శకాలనీగా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసి ఉన్నారని ఆ కార్యక్రమం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని సమ్మర్‌ స్టోరేజి ట్యాంకు సమీపంలో పేదల కు పట్టాలు ఇచ్చి ఉన్న స్థలానికి హద్దురాళ్లు వేయించి లే అవుట్‌ సిద్ధం చేయటం ద్వారా అర్హులైన వారందరికీ పొజిషన్‌ చూపించ టంతో పాటు మరికొంతమంది అర్హులు కూడా ఉన్నందున వారికి కూడా నివాస స్థలాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని పోతుల రామారావు విజ్ఞప్తి చేశారు. లే అవుట్‌ వేయటానికి హద్ధురాళ్లకు నిధులు లేనందున ఈ కార్యక్రమం నిలిచి ఉన్నట్లు జిల్లా కలెక్టర్‌ చెప్పినందున మున్సిపాలిటీ నుండి ఆ నిధులు సర్థుబాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. దీంతో సబ్‌ కలెక్టర్‌ మల్లిఖార్జున మాట్లాడుతూ కందుకూరు మునిసిపాలిటీకి పాలకవర్గం లేనందున జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకంలో చేర్పించేం దుకు అవకాశాలు లేనట్లేనని, లే అవుట్‌ విషయం జిల్లా కలెక్టర్‌తో చర్చించి తగిన చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఎమ్మెల్యే పోతుల రామారావు వెంట ఉన్నం వీరా స్వామి, గంగిరెడ్డి, పోతుల ప్రసాదు తదిత రులు ఉన్నారు.
జరే్ఠిజిఖిౄ5