Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 20 2014 @ 04:23AM

నవంబరులోగా రుణమాఫీ
మలికిపురం: రాష్ట్రాన్ని చంద్రబాబు అన్ని రంగాల్లోను ముందుకు తీసుకువెళతారని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కేశనపల్లిలో శుక్రవారం ప లు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అధ్య క్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ వందరోజుల్లో కేంద్రంతో మాట్లాడి పోలవరం ప్రాజెక్టుకు క్లియరె న్స్‌ తెచ్చామని, ఎర్రచందనం దొంగలను అదుపు చేశామన్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ నవంబరులోపు పూర్తిచేస్తామన్నారు. రాష్ట్రం విడిపోయేటప్పటికి రూ.15వే ల కోట్లు లోటు ఉందని అయినా సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. బెల్టుషాపులను రద్దుచేశామని అక్టోబ రు రెండు నుంచి ఎన్టీఆర్‌ సుజల పథకం, రూ.వెయ్యిపెన్షన్లు అందజేస్తామన్నారు. ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధికల్పనకు కృషి చేస్తారన్నారు. గోదావరి ఇసుక గురించి మా ట్లాడుతూ కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు రాగానే అందుబాటులోకి తెస్తామన్నారు. కేశనపల్లిలో గ్రామస్తుల కోరిక మేరకు జూనియర్‌ కళాశాల ఏర్పాటుకు తమవంతు సహకారం అందిస్తానన్నారు.
అమలాపురం ఎంపీ డాక్టర్‌ పండులరవీంద్రబాబు మాట్లాడుతూ కేశనపల్లిలో జూనియర్‌ కళాశాల ఏర్పాటుకు ఎంపీ నిధుల నుంచి రూ.కోటి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. తాను ఇప్పటికే కేంద్రంతో పలు సంప్రదింపులు జరుపుతున్నానని నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభి వృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. జడ్పీ చైర్మన్‌ నామన రాంబాబు మాట్లాడుతూ ముఖ్యమం త్రి, జిల్లా ప్రజాప్రతినిధుల సహకారంతో తాను అభివృద్ధిలో పాలుపంచుకుంటానన్నారు. ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ జిల్లాకు చివరన ఉన్న రాజోలు నియోజకవర్గంపై ఉపముఖ్యమంత్రి పెద్దమనసుపెట్టి చూడాలని కోరారు.
సమావేశంలో చినరాజప్పను గజమాలతో, సువర్ణ అంగుళీకంతో ఎంపీటీసీ యెనుముల సాయినారాయణస్వామి ఘనంగా సన్మానించారు. ఎంపీ రవీంద్రబాబు, ఎమ్మెల్యే గొల్లపల్లి, జడ్పీచైర్మన్‌లను గ్రామస్తులు, జనసేన కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ముందుగా రాజమండ్రి జీఎస్‌ ఎల్‌ ఆసుపత్రి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సం యుక్తంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని రాజప్ప ప్రారంభించారు. పలువురికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అరుంధతి పేట లో రూ.అయిదులక్షలతో నిర్మించే సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. రూ.14 లక్షలతో నిర్మించే ఆరోగ్య ఉపకేంద్రానికి శంకుస్థాపన చేశారు. కేశనపల్లిలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని చినరాజప్ప, ఎమ్మెల్యే, జడ్పీచైర్మన్‌ పరిశీలించి సంతృ ప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యానిమేటర్లు తమసమస్యలు పరిష్కరించాలని కోరు తూ రాజప్పకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ జి.గంగాభవానీ, జడ్పీటీసీ మంగెన భూదేవి, మాజీ ఎమ్మెల్యే ఏవీ సూర్యనారాయరాజు, బత్తుల రాము, ముదునూరి చినబాబు, ఆర్‌.వెంకటరామరాజు, మం గెన రాధాకృష్ణ, యనుముల సాయినారాయణస్వామి, వివిధగ్రామాల సర్పంచ్‌లు, ఎంపీ టీసీలు పాల్గొన్నారు.
గూడపల్లిలో:రాష్ట్రఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జడ్పీచైర్మన్‌ నామన రాంబాబు, ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు శుక్రవారం గూడపల్లి నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సుందర కొండబాబు, ఎంపీటీసీ కటికిరెడ్డి గోపాలకృష్ణ, సొసైటీ అధ్య క్షుడు కామిశెట్టి రామకోటేశ్వరరావు, సుందర బ్రహ్మయ్య, తదితరులు స్వాగతం పలికారు. ోచణ్క÷ ్కథసబీ్ఞి/బగీళ)ఏశ్శీ)