Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 20 2014 @ 03:34AM

నామమాత్రపు సమీక్షలు...


అనంతపురం: వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటన అంతా హడావుడే. నియోజకవర్గాల సమీక్షలు నామమాత్రంగా సాగాయి. పార్టీ శ్రేణులకు కంఠ శోషే మిగిలింది. సీఎం చంద్రబాబు, ఆ పార్టీ లక్ష్యంగానే శుక్రవారం సమీక్షలు ముగిశాయి. జగన్‌ ధోరణిలో ఎలాంటి మార్పు కనిపించలేదన్న భావన ఆ పార్టీ వర్గాల నుంచి వ్యక్తం కావడం గమనార్హం. నగర శివారులోని ఆర్‌కె ఫంక్షన్‌ హాల్‌లో రెండో రోజు... అనంతపురం, కళ్యాణదుర్గం, రాయదుర్గం, రాప్తాడు, తాడిపత్రి, గుంతకల్‌ నియోజకవర్గాల వారిగా జగన్‌ ఆయా ప్రాంతాల్లో పార్టీ పరిస్థితిపై సమీక్షించారు. మొదటి రోజు సమీక్షల్లో ఆయా నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తల తరహాలోనే రెండో రోజూ నాయకులు, కార్యకర్తలు తమ సమస్యలు ఏకరువుపెట్టినా, బాధలు విన్నవించుకున్నా, ముఖ్య నాయకుల ధోరణిపై ఫిర్యాదు చేసినప్పటికీ అధినేత నుంచి పెద్దగా ప్రతిస్పందన కనిపించలేదన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల నుంచే వినవస్తోంది. విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు జగన్‌ తనమాటలే తప్ప ఎదుటి వారి సమస్యలను సామధానంగా విని అమలు చేసే తత్వం ఆయనలో కనిపించలేదన్న ఆవేదన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. నాయకులు, కార్యకర్తలు తమ నియోజకవర్గాల్లో పరిస్థితి, వారి బాధలు సమస్యలకన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ పార్టీయే లక్ష్యంగా జగన్‌ మాట్లాడినట్లు తెలిసింది. ఒక్క మాటలో చెప్పాలంటే తన రెండ్రోజుల పర్యటనలో పాడిందే పాడరా అన్న చందంగా నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు జరిగాయని చెప్పవచ్చు. పార్టీ కార్యకర్తలెవరైనా చనిపోతే బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు గానూ చంద్రబాబు తరహాలో కార్యకర్తల నిధిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన తీసుకొచ్చిన సందర్భంలో ఆయన నవ్వి ఊరుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. పార్టీని బలోపేతం చేయాలంటే కార్యకర్తలతో నేరుగా మాట్లాడాలని కోరిన సందర్భంలోనూ ప్రతిస్పందన కనిపించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడు నెలల్లో మరోమారు జిల్లాకు వస్తానని అప్పుడు కార్యకర్తలందరూ నాయకులు బాగా పనిచేస్తున్నారనే అభిప్రాయం రావాలని సూచించినట్లు తెలిసింది. నియోజకవర్గాల్లో బహుళ ఆధిపత్యం కాకుండా ఒకరి చేతుల్లోనే ఉండే విధంగా మసులుకోవాలని ఆయా నియోజకవర్గాల ముఖ్య నాయకులకు సూచించినట్లు సమాచారం. వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే ప్రతిఘటించాలని నేతలకు జగన్‌ హితబోధ చేసినట్లు సమాచారం. సమీక్షల్లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్‌బాషాలతోపాటు ముఖ్యనాయకులు అనంత వెంకటరామిరెడ్డి, గురునాథ్‌రెడ్డి, వై. వెంకటరామిరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, తోపుదుర్తిప్రకాష్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ధనుంజయయాదవ్‌, ఎస్వీ సోమశేఖర్‌రెడ్డి,కేతిరెడి ్డ వెంకటరామిరెడ్డి, చవ్వా రాజశేఖర్‌రెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి, పెన్నోబులేసు, మారుతినాయుడు తదితరులు పాల్గొన్నారు.౅్ఠిజీొౄ3