Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 20 2014 @ 02:59AM

మరో మూడు వైద్య కళాశాలలు


తిరుపతి (తిలక్‌ రోడ్‌): జిల్లాలో చిత్తూరు, చంద్రగిరి, రేణిగుంటలలో మరో మూడు వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. స్విమ్స్‌ను ఎయిమ్స్‌ కంటే అధునాతనంగా మారుస్తామన్నారు. తిరుపతిలోని రష్‌ మల్టీ స్పెషాలిటీ లేజర్‌ ఆస్పత్రిలో శుక్రవారం ప్రపంచ ప్రొస్టేటు వ్యాధి నివారణ వారోత్సవాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. యూరిన్‌కు సంబంధించిన ప్రొస్టేటు వ్యాధి 40 ఏళ్లపైబడిన పురుషులకే వస్తుందన్నారు. మూత్రం పోయడానికి 10 నిమిషాల పాటు సమయం పడితే వారికి ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించవచ్చన్నారు. ఈ వ్యాధి పెరిగేకొద్దీ క్యాన్సర్‌గా మారొచ్చని పేర్కొన్నారు. ముందే గుర్తించి హార్మోన్‌ థెరఫీ చేయించుకుంటే తక్కువ వ్యయంతో, త్వరగా నయమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. దీనికిగాను ఏడాదికోసారి పీఎస్‌ఐ పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కోరారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వాస్పత్రుల్లో 30 శాతం చొప్పున జరిగే శస్త్రచికిత్సలను 50 శాతానికి పెంచడమే తమ లక్ష్యమన్నారు. కాగా, రష్‌లో ప్రొస్టేటు వ్యాధి వారోత్సవాల సందర్భంగా 25వ తేది వరకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాధారణ మూత్ర సమస్యలపై కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే వెంకటరమణ, బీజేపీ నేత భానుప్రకాష్‌ రెడ్డి, రష్‌ అధినేత సిపాయి సుబ్రహ్మణ్యం, డాక్టర్‌ శ్రీహరి, జల్లి మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు.