Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 20 2014 @ 02:53AM

దీపావళి బోనస్‌ రూ.40 వేలు

గోదావరిఖని: దేశంలోని బొగ్గు గని కార్మికులకు ప్రాఫిడ్‌లిం క్‌డ్‌ రివార్డ్‌(పీఎల్‌ఆర్‌) రూ.40వేలు చెల్లించేందుకు కోల్‌ ఇండి యా యాజమాన్యంతో జాతీయ కార్మిక సంఘాల ఒప్పందం కు దిరింది. శుక్రవారం జరిగిన ఈ ఒప్పందంతో సింగరేణి కార్మికులకు కూడా ప్రయోజనం కలగనుంది. కోల్‌ వేజ్‌బోర్డు పరిధిలోకి వచ్చే కార్మికులందరికీ పీఎల్‌ఆర్‌ వర్తిస్తుంది. దీంతో సింగరేణిలో ని 60వేల మంది కార్మికులకు పీఎల్‌ఆర్‌ కింద ప్రతి ఒక్కరికీ రూ.40 వేలు అందనున్నాయి. సింగరేణిలో ఈ పీఎల్‌ఆర్‌ను దీ పావళి బోనస్‌గా చెల్లించడం ఆనవాయితీ. దీపావళికి ముందు ఈ ప్రయోజనం అందుతుంది కనుక కార్మికులకు దీపావళి బోనస్‌ కింద యాజమాన్యం అందజేస్తుంది. కోల్‌ ఇండియాలో దసరా ముందు పీఎల్‌ఆర్‌ అందజేస్తారు. సింగరేణిలో మాత్రం దసరాకు అడ్వాన్స్‌గా ఇస్తూ, దీపావళి ముందు కార్మికులకు పీ ఎల్‌ఆర్‌ అందజేస్తూ వస్తున్నారు. గత సంవత్సరం పీఎల్‌ఆర్‌ కింద రూ.31,500 చెల్లించగా, ఇప్పుడు మరో రూ.8500 పెంచుతూ పీఎల్‌ఆర్‌ను నిర్ణయించారు. జాతీయ కార్మిక సంఘాలు ఐ ఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, బీఎంఎస్‌, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ ఒత్తిడి మేరకు పీఎల్‌ఆర్‌ పెరిగింది. పీఎల్‌ఆర్‌ భారం సింగరేణిపై రూ.240కోట్లు పడనుంది. 60వేల మంది కార్మికులు ఉన్న సింగరేణిలో ప్రతి కార్మికునికి దీపావళి బోనస్‌గా రూ.40 వేలు చెల్లించడంతో సింగరేణి రూ.240కోట్లు ఖర్చు కానుంది.