Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 20 2014 @ 02:15AM

సీఎం దృష్టికి వీవోఏల సమస్య: ప్రభుత్వ విప్‌

బూర్జ రూరల్‌: వీవోఏల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరి ష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ అన్నారు. శుక్రవారం మండల కేం ద్రానికి వచ్చిన ఆయన వీవోఏల నిరాహారదీక్ష శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రికి వీవోఏల సమస్య లను ఎందుకు విన్నవించలేదన్నారు. గత రెం డురోజుల్లో పత్రికల్లో వస్తున్న కథనాలను చూసి మహిళా సదస్సుకు హాజరైన సెర్ప్‌ సీఈవో రాజశేఖర్‌ను వీవోఏల సమస్యలను ప్రస్తావించానని పేర్కొన్నారు. అయితే ఆయన గ్రామైక్య సంఘాలకు వెలుగు ప్రాజెక్టు ప్రారంభమైనప్పుడు నిధులు మంజూరు చేశా మని, ఈనిధులను సభ్యులకు అప్పుగా ఇచ్చి వాటి ద్వారా వచ్చే వడ్డీతో వీవోఏలకు జీతాలు చెల్లించాలని తెలియజేశారు. అయితే ఆ రుణాలు వసూలు కాకపోవడంతోనే సమస్య వచ్చిందన్నారు. ఏది ఏమైనా సమస్య పరి ష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వీవోఏలు జయమ్మ, కళావతి, భారతి తదితరులు పాల్గొన్నారు. :