Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 20 2014 @ 02:04AM

నష్ట పరిహారం కోరుతూ రైతుల ధర్నా

ఆమనగల్లు: పంట నష్టపరిహారం అందించాలని కోరుతూ ఆమనగల్లు మండలం సింగంపల్లి, చెన్నంపల్లి గ్రామ రైతులు శుక్రవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాల యం ముందు ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేదిలేదని భీష్మించారు. వివరాల్లోకి వెళితే గతేడాది కురిసిన భారీవర్షాలకు సింగంపల్లి, చెన్నంపల్లి గ్రామాలకు చెందిన అనేకమంది రైతుల పంటలు దెబ్బతిన్నాయి. అప్పట్లో ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలాధికారులు దెబ్బతిన్న పంటలను పరిశీలించి, నష్టం అంచనా నివేదికలను రూపొందించారు. కాగా, ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పరిహారం మంజూరు జాబితాలో వారి పేర్లు లేకపోవడంతో ఆందోళనకు గురైన రైతులు రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నించినా స్పందన లేకపోయింది. దీంతో ఆగ్ర హించిన రైతులు తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. రైతుల ఆందోళనకు పోలేపల్లి ఎంపీటీసీ శ్రీనివాసులు, ఆమనగల్లు ఎంపీటీసీ పత్యానాయక్‌ సంఘీభావం తెలిపారు. పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం మంజూరుకాకపోగా, అనర్హులు, పంటలు సాగుచేయనివారికి పరిహారం మంజూరైందని వారు వాపోయారు. పంట నష్టపోయి, పరిహారం అందని రైతుల జాబితా ను తిరిగి వ్యవసాయ శాఖాధికారుల ద్వారా జేడీఏకు నివేదించి న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు హామీనిచ్చారు. దీంతో రైతులు తహశీల్దార్‌ శ్రీనుకు వినతిపత్రాన్ని అందజేసి, ధర్నా విరమించారు. రైతు సం ఘం నాయకులు పీ.శ్రీను, రవి, జంగిరెడ్డి, అంజయ్య, రాములు, లక్ష్మయ్య తదితరులున్నారు.ఠటఞగడఔొగీ