Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 20 2014 @ 01:52AM

అధ్వానం ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట రహదారి

వల్లూరు : జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న ఆదినిమ్మాయపల్లె ఆనకట్టకు వెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది. దీంతో పర్యాటకులు, స్థానిక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగాలివారిపల్లె నుంచి 2 కిలో మీటర్లమేర రహదారి పూర్తిగా దెబ్బతింది. అడుగులోతు గుంతలు పడి బురదమయంగా మారి కనీసం నడవటానికి కూడా వీలులేకుండా ఉంది. ద్విచక్రవామనాలు వెళ్లాలంటే టైర్లకు బురదమట్టి అంటుకొని తిరగకుండా నిలిచిపోతున్నా యి. ప్రస్తుతం వరిపంటసాగు చేస్తున్నందున ఎద్దులబండ్లు పోయేందుకు వీలు లేకపోవడంతో నానా తిప్పలు పడుతున్నారు. సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలతో రహదారి దారుణంగా మారింది.
ఆనకట్టవద్దకు, పవిత్ర పుణ్యక్షేత్రం పుష్పగిరికి వెళ్లాలంటే ఈ రహదారి గుండానే వెళ్లాల్సి ఉంది. దీంతో భక్తులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. ప్రభుత్వం రహదారుల కోట్లు రూపాయలు ఖర్చు చేస్తున్న ఆనకట్ట రహదారి గురించి మాత్రం పట్టించుకేనే వారే లేరని స్థానిక ప్రజలతో పాటు, పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డు బాగు చేయాలని కోరుతున్నారు.
నిధులు విడుదల చేయాలి
రహదారి ఇంత అధ్వానంగా ఉన్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం విచారకరం. ఇప్పటి కైనా ప్రభుత్వం స్పందించి రహదారి ఏర్పాటకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
- నారాయణ, ఆదినిమ్మాయపల్లె సర్పంచి షడభిాగీఔ