Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 20 2014 @ 01:51AM

ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు మావోయిస్టు దళాలు : డీఐజీ



ఆదిలాబాద్‌రూరల్‌: ఆదిలాబాద్‌ జిల్లా మంగి దళం,ఇంద్రవెల్లి దళంపేరుతో ఎనిమిది మంది సభ్యులతో కూడిన రెండు మావోయిస్టు దళాలు సంచరిస్తున్నాయని కరీంనగర్‌ రేంజి డీఐజీ భీమానాయక్‌ అన్నారు. ఆదిలాబాద్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల తిర్యాణి అటవీ ప్రాంతంలో గాలింపు ప్రక్రియలో పోలీసులకు తారస పడిన దళాలు త్రుటిలో తప్పించుకున్నాయన్నారు. లొంగి పోయిన వారికి రివార్డుతో పాటు, పునరావాసం కింది ఇళ్ళ స్థలం, రుణ సౌకర్యంతో పాటు జీవనోపాధి కల్పిస్తామని తెలిపారు./ఠీఠీఠీ.్చుఽఛీజిట్చ్జడ్టౌజిడ.ఛిౌఝ/ ్న4ౌట