Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 20 2014 @ 01:50AM

లొంగిపోయిన మావోయిస్టుకు అందని భూమి

బెల్లంపల్లి: నక్సలైట్లు లొంగిపోతే పునరావాసం కల్పి స్తామని, 5ఎకరాల భూమితో పాటు రివార్డులు అందజేసి అన్నివిధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. పోలీ సుశాఖ ద్వారా లొంగిపోయిన నక్సలైట్లకు రివార్డులు అందుతున్నాయి. కానీసాగు భూ ములు అందడం లేదు. తాండూర్‌ మండలం కొత్తపల్లి శివారులో ఓ మాజీమావోయిస్టుకు పునరావాస చర్యల కింద 5ఎకరాల భూమికి బదులు రెండున్నర ఎకరాలు మాత్రమే అంద జేసి పట్టా ఇచ్చారు. కానీ ఆ భూమిని ఇతరులు సాగుచేస్తున్నారు. ఈవిషయమై ఆసిఫాబాద్‌ సబ్‌ కలెక్టర్‌కు, తాండూర్‌ మండల తహసీల్దార్‌కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్న నాథుడు లేడు. తిర్యాణి మండలం మంగి పంచాయతీలోని పాతగూడ గ్రామానికి చెందిన రాయిసిడం జనంత్‌రావు అలియాస్‌ లాల్‌చంద్‌ అలియాస్‌ ప్రసాద్‌ మావోయిస్టు పార్టీలో చత్తీస్‌గడ్‌ రాష్ట్రంలో కమాండర్‌గా పనిచేసేవాడు. అతని భార్య వరంగల్‌ జిల్లా హసన్‌పర్తి మండలం జైగిరి గ్రామానికి చెంది న కోనుగంటి అరుణ అలియాస్‌ లత సైతం చత్తీ్‌స్‌ గడ్‌లో మావోయిస్టు మహిళ నాయకురాలుగా పనిచేసేది. భార్యభర్తలిద్దరు 2010ఏ ప్రిల్‌ 21న నాటి ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ ప్రమోద్‌కుమార్‌ ఆధ్వర్యంలో కరీంనగర్‌ రేంజి డీఐజీ డాక్టర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. వీరికి హోంశాఖ ద్వారా మంజూరైన రూ.3 లక్షల రివార్డు కూడా అందింది. తాం డూర్‌ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో చాందా- బెల్లంపల్లి రాషీ్ట్రయ రహదారి పక్కన సర్వే నెంబరు 184/ఈలోని 2ఎకరాల 50 సెంట్ల భూమి సైతం పట్టారూపకంగా రెవెన్యూ అధి కారులు అందజేశారు. కానీ ఆ భూమిని తాం డూర్‌ మండలానికి చెందిన తాళ్లపల్లి శంకర్‌ గౌడ్‌ పేరున లావాణి పట్టా ఇచ్చినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. రెవెన్యూ శాఖాధికారుల నిర్వాకం, మాజీనక్సలైట్ల పునరావాసం కింద ఇచ్చే సాగు భూమిని రెవెన్యూ శాఖ ఇతరులు ఆక్రమించిన భూములను, సమస్యగా ఉన్న భూములను కట్టబెట్టి చేతులు దు లుపుకుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై తగున్యాయం చేసి భూమిని తమకు చెందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్‌ సబ్‌ కలెక్టర్‌కు, తాండూర్‌ తహసీల్ధార్‌కు ఆ మాజీనక్సలైటు కుటుంబం ఎన్ని దరఖాస్తులు పెట్టినా ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మాజీనక్సలైట్లకు పట్టా గా ఇచ్చిన భూమిని వారికే చెందే విధంగా చర్యలు తీసుకుని వారి పునరావాసానికి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ఆమరణ దీక్ష చేపడతాం
తమకు ప్రభుత్వం పునరావాసం కింద ఇచ్చిన భూమిని రెవెన్యూ శాఖ అందజేయకుంటే ఆసిఫాబాద్‌ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్ష చేస్తామని అందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలని వారు హెచ్చరించారు. తమకిచ్చిన భూమిని ఇతరులకు లావాణి పట్టా ఎలా ఇస్తారని ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ స్పందించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని పట్టా భూమిని తమకివ్వాలని డిమాండ్‌ చేశారు.క్ష24ద్ఞడజ్ష్గుఖీ