desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 20 2014 @ 01:46AM

ప్రజల ఆకాంక్షల అణిచివేతకే మీడియా పై నిషేధం

 టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు ఆంజనేయగౌడ్‌
హైదరాబాద్‌, సెస్టెంబర్‌ 19: విద్యార్ధుల ఉద్యమాలు, ప్రజల ఆకాంక్షల అణచివేతకే తెలంగాణలో మీడియాపై నిషేధం విధించారని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు ఆంజనేయగౌడ్‌ ఆరోపించారు. ప్రభుత్వమే స్వయంగా మీడియాపై బెదిరింపులకు దిగడం అన్యాయమన్నారు. మెట్రో రైలు వివాదం అంశంలో ప్రభుత్వ పెద్దల బండారం బయటపడకుండా ఉండేందుకు మీడియాను బలిపశుగా చేసి, అభాండాలు మోపి తప్పించుకోజూస్తున్నారని విమర్శించారు. ఉద్యోగాల కోసం ఉద్యమించిన ఓయూ విద్యార్ధులపై అణిచివేత, సెప్టెంబర్‌ 17న విమోచన దినం జరపాలని ఉద్యమించిన సంస్థలపై నిర్భంధం, తదితర నియంత చర్యలతో సీఎం కేసీఆర్‌ ప్రజాస్వామ్య గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బెదిరింపులతో అన్ని వర్గాలను భయభ్రాంతులకు గురిచేసి రాష్ట్రాన్నిఇష్టారాజ్యంగా పాలించాలని కేసీఆర్‌కుటుంబం నిత్యం కుట్ర లు పన్నుతోందని ఆరోపించారు.ఈ అంశాలన్నిటిపై చర్చించేందుకు విద్యార్ధి, ప్రజా, యువజన, మహిళా, జర్నలిస్టు సంఘాలను, రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించి ఎన్టీఆర్‌ భవన్‌లో సెప్టెంబర్‌ 23వ తేదీ ఉదయం 11 గంటలకు ‘ప్రజాస్వామ్య తెలంగాణ-మీడియాపై నిషేధం’ అనే అంశంపై విస్తృత స్థాయిలో చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆంజనేయగౌడ్‌ తెలిపారు.