Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 12 2016 @ 23:52PM

మార్పు కోసం సంస్కరణలు

  • కొనసాగిస్తామన్న ప్రధాని మోది.. చైనాకు పరోక్షంగా చురకలు
  • ఆసియాపై ఐఎంఎఫ్‌ చీఫ్‌ ప్రశంసలు
న్యూఢిల్లీ: మార్పు కోసం సంస్కరణలు అనే విధానాన్ని కొనసాగిస్తామని, వృద్ధి కోసం అనువైన పాలసీలను తీసుకవస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. స్థూల ఆర్థిక స్థిరత్వానికి ఇండియా కేరాఫ్‌ అడ్రస్‌ అన్నారు. ప్రపంచంలో పెద్దఎకానమీలన్నింటిలో భారత వేగంగా వృద్ధి సాధిస్తోందన్నారు. భాగస్వాముల ప్రయోజనాలను పణంగా పెట్టి లాభం పొందాలని భారత ఎప్పుడూ భావించలేదన్నారు. ‘బెగ్గర్‌ దే నైబర్‌’ (కరెన్సీ డీవాల్యుయేషన్‌కు పాల్పడడం, ఇతర దేశాల ప్రయోజనాలను పణంగా పెట్టి రక్షణాత్మక విధానాలను రూపొందించడం)లాంటి పాలసీలను భారత ఎప్పుడూ పాటించలేదని ఆయన పరోక్షంగా చైనాకు చురకలేశారు. భారత, ఐఎంఎఫ్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘అడ్వాన్సింగ్‌ ఆసియా: ఇన్వెస్టింగ్‌ ఫర్‌ ద ఫ్యూచర్‌’ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఎకానమీలో అన్ని రంగాల్లో ఎఫ్‌డిఐలకు ద్వారాలు తెరిచామన్నారు. గతేడాది ఈజ్‌ ఆ్‌ఫ డూయింగ్‌ బిజినెస్‌, ఇతర సూచీల్లో భారత స్థానం మెరుగుపడిందని తెలిపారు.
 
కోటాలో సంస్కరణలు చేయాలి
ఐఎంఎ్‌ఫలో వివిధ దేశాలకు కేటాయించిన కోటాలు వాస్తవాలకు దగ్గరగా లేవని మోదీ అభిప్రాయపడ్డారు. కోటా విషయంలో మరిన్ని సంస్కరణలను తీసుకరావాలని ఐఎంఎ్‌ఫను కోరారు. ఐఎంఎ్‌ఫలో భారత కోటా 2.44 శాతం నుంచి 2.7 శాతానికి పెరిగింది. ఈ సదస్సులో భాగంగా ప్రాంతీయ ట్రైనింగ్‌ కేంద్రం (ఎ్‌సఎఆర్‌టిటిఎసి) ఏర్పాటుకు సంబంధించి భారత, ఐఎంఎఫ్‌ ఒప్పందంపై సంతకాలు చేసాయి. ఆసియాలో ఐఎంఎఫ్‌ కార్యకలాపాలపై అధిక శ్రద్ధ వహించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
 
వెలుగులు చిమ్ముతున్న భారత తార
అంతర్జాతీయ ఆర్థిక ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారత వెలుగులు చిమ్ముతోందని ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టినా లగార్డ్‌ ప్రశంసించారు. ప్రపంచ ఎకానమీలో ఆసి యా వాటా 40 శాతమని, వచ్చే నాలుగేళ్ల పాటు ప్రపంచ వృద్ధిలో మూడింట రెండొంతుల వంతును ఆసియా సమకూర్చనుందని అన్నారు. భారత అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అతిపెద్ద ఎకానమీ అని అన్నారు. యువతే భారత బలమన్నారు. చరిత్రలో భారత ఒక కీలకమైన స్థానంలో ఉందని, ముఖ్యమైన సంస్కరణలు అమల్లో ఉన్నాయని చెప్రారపు. మేక్‌ ఇన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా లాంటి బృహత్తర పథకాలను ఆమె కొనియాడారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి వ్యవస్థాపక సభ్యదేశాల్లో భారత ఒకటని గుర్తు చేశారు. ప్రస్తుతం గ్లోబల్‌ ఎకానమీ పలు సవాళ్లను ఎదుర్కొంటోందని అభిప్రాయపడ్డారు.