Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 19 2014 @ 19:52PM

మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు : సదానందగౌడ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 : మహిళల భద్రకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌ మౌలాలిలోని ఆర్పీఎఫ్‌ శిక్షణా కేంద్రంలో జరిగిన 53వ బ్యాచ్‌ ఎస్సైల పాసింగ్‌ పెరేడ్‌కు సదానంద గౌడ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరస్తులు, సంఘ విద్రోహ శక్తుల నుంచి రైల్వేను సురక్షితంగా ఉంచాల్సిన అవసరం ఉందని అన్నారు.
 
రైళ్లలో మహిళలు, చిన్నారులపై నేరాలు జరుగుతున్న ఘటనలు మనకు తెలుసునని, మీకున్న చట్టపరమైన అధికారాలను ఉపయోగించి రైళ్లను నేరస్థులు, సంఘ వ్యతిరేక శక్తుల నుంచి సురక్షితంగా ఉంచాలని సదానంద గౌడ ఎస్‌ఐలకు సూచించారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని ఆయన అన్నారు.