Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 19 2014 @ 19:23PM

ఏపీలో రూ. 1000 కోట్ల నిధుల సమీకరణ సెక్యూరిటీ బాండ్ల వేలం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 : వెయ్యి కోట్ల రూపాయల నిధుల సమీకరణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సెక్యూరిటీ బాండ్లను వేలం వేయనున్నారు. ఈ నెల 23న ఆర్‌బీఐ ముంబాయి కార్యాలయంలో బాండ్ల వేలం జరగనుంది. ఏపీ లోటు బడ్జెట్‌లో ఉందని ఏ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలన్న ఆర్థికలోటు ఉందని, అన్ని కార్యక్రమాలు అమలు చేయాలంటే వేలాది రూ. కోట్లు కావాలని అందుకోసం ప్రభుత్వం వద్ద ఉన్న సెక్యూరిటీ బాండ్‌లను వేలం వేయడానికి నిర్ణయించింది.
 
ఏపీ ప్రభుత్వం పదేళ్ల కాలపరిమితిపై రూ. వెయ్యి కోట్ల బాండ్లను వేలం వేయనుంది. దీనికి సంబంధించిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ కల్లాం ఈ విషయం వెల్లడించారు. తద్వారా వచ్చిన ఆదాయంతో రాష్ట్రంలోని సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వం చూస్తుందని సమాచారం.