Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 19 2014 @ 03:49AM

పరిశ్రమలకు అడ్డంకులు సృష్టించవద్దు


(శ్రీకాకుళం-ఆంద్రజ్యోతి)
జిల్లాకు వస్తున్న పరిశ్రమల ఏర్పాటుకు అడ్డంకులు సృష్టించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీఐటీయూ నాయకు లకు హితవుపలికారు.గురువారం వీకేటీ ఫార్మా కంపెనీని ప్రారంభించేందుకు వచ్చిన ఆయన కు సీఐటీయూ నాయకులు అడ్డుతగిలారు. ర ణస్థలం మండలంలోని కొవ్వాడ అణువిద్యుత్‌ పార్క్‌ను వ్యతిరేకిస్తున్నట్లు సీఎంకు వినతిప త్రం అందజేశారు. దీంతో సీఎం కలుగజేసుకునిపరిశ్రమలు అభివృద్ధికి సోపానాలని అన్నా రు.ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు సీఐటీయూ నాయకులను ఉద్దేశించి మా ట్లాడుతూ పరిశ్రమల ద్వారా ఉపాధి మార్గా లు మెరుగుపడతాయని తెలిపారు. ప్రభుత్వ భూమిఉన్న చోటే పరిశ్రమల ఏర్పాటుకు ప్రో త్సహిస్తుమని చెప్పారు.
అణువిద్యుత్‌ కేంద్రాన్ని రద్దుచేయాలి
రణస్థలం: కేంద్ర ప్రభుత్వం కొవ్వాడలో ఏ ర్పాటుచేయనున్న అణువిద్యుత్‌కేంద్రాన్ని రద్దు చేయాలని కొవ్వాడ గ్రామానికి చెందిన మైల పల్లి పోలీసు, కలిశెట్టి అప్పలనాయుడు, ఏంపీ టీసీ ప్రతినిధి మైలపల్లి రాయుడు, సీఐటీయూ నాయకులు డి.గోవిందరావు, పి.తేజేశ్వరరావు, కూనరామం తదితరులు ముఖ్యమంత్రి చంద్ర బాబుకు వినతిపత్రం అందజేశారు. అణువి ద్యుత్‌ కేంద్రం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని చంద్రబాబు తెలిపా రు. కేంద్ర ప్రభుత్వం అణువిద్యుత్‌ కేంద్రాన్ని రద్దు చేయడానికి అంగీకరించకపోతే మెరుగైన ప్యాకేజీ కోసం ప్రయత్నిస్తానని హామీఇచ్చారు.