Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 19 2014 @ 03:44AM

ఐద్వా ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ

కోల్‌సిటీ: గోదావరిఖని పట్టణంలో తెలం గాణ ప్రజా సాంస్కృతిక, ఐద్వా, సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ నిర్వహించారు. స్థానిక జూనియర్‌ కళాశాలగ్రౌండ్‌ నుంచి మహిళలు బతుకమ్మలతో డప్పుల చప్పుళ్ల మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చౌరస్తాలో పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. ఈకార్యక్రమానికి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ సుహాసిని, టీపీకేఎస్‌ జిల్లా నాయకులు జీ ముకుందరెడ్డిలు హాజరై మాట్లాడారు. బతుకమ్మ పండుగ తెలంగాణలో ఆడవారికి ప్ర త్యేకమైందని, ఏపూజకు నోచుకోని పూలతో అందంగా బతుకమ్మను పేర్చి తొమ్మిరోజులు ఆడుకుంటారన్నారు. ఈ రోజుల్లో బ్రూణహత్యలు పెరిగిపోతున్నాయని, దీనివల్ల ఆడవా రి జనాభా తగ్గిపోతుందని, ఆడపిల్లలను పు ట్టనిద్దాం.. బతకనిద్దాం.. చదవనిద్దాం..ఎదగని ద్దాం.. అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు యాకయ్య, జిల్లా కార్యర్శి బీ తిరుపతి, నాయకులు వేల్పుల కుమారస్వామి, ఎం రామాచారి, పీ సతీ ష్‌, ఐద్వా కార్యదర్శి మహేశ్వరి పాల్గొన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ గ్లర్స్‌ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ
సుభాష్‌నగర్‌: స్థానిక సర్కస్‌గ్రౌండ్‌లో ఎస్‌ఎఫ్‌ఐ గ్లర్స్‌ కమిటీ కన్వీన ర్‌ రంగు దివ్య ఆధ్వర్యంలో గురువారం బతుకమ్మపండు గను నిర్వహించారు. ఆడపిల్ల ను పుట్టనిద్దాం - బతకనిద్దాం - చదవనిద్దాం - ఎదగనిద్దాం అంటూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. కార్యక్రమానికి ముందు నగరంలోని మంకమ్మతోటనుంచి సర్కస్‌గ్రౌండ్‌ వరకు బతుకమ్మలతో ర్యాలీ గా చేరుకున్నారు. కార్యక్రమానికి తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం జిల్లా నాయకకు లు జి ముకుందరెడ్డి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా మహిళలు జరుపుకునే బతుకమ్మ పండుగ సీ్త్రల వ్యక్తిత్వాన్ని, ఔన్నత్వాన్ని తెలియజేస్తుందన్నా రు. ఈ రోజుల్లో ఆడపిల్లల బతుకులు చాలా అధ్వానంగా ఉందని,వారిని గర్భంలోనే చంపి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజురో జుకు వారి సంఖ్య తీవ్రంగా పడిపోతుందని, జిలల్లాలో 1000మంది బాలురకు 937మంది బాలికలు ఉన్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో కోకన్వీనర్లు రేణుక, ప్రి యాంక, స్రవంతి, అవంతి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, శేఖర్‌, నాయకులు ఎం తిరుపతి, జి తిరుపతి నాయ క్‌, శివరాజ్‌, సంతోష్‌, అరుణ్‌, సురేష్‌, రాజునాయక్‌, సందీప్‌, మహిళలు పాల్గొన్నారు.