Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 19 2014 @ 03:37AM

రాయలసీమకు ప్రత్యేక హోదాకల్పించాలి


రైల్వేకోడూరు : రాయలసీమకు ప్రత్యేక హో దాకల్పించాలని, ప్రత్యేకప్యాకేజి కేటాయించాల ని, లక్షమందికి ఉపాధికల్పించే ఉక్కుపరిశ్రమ ను కడపలో నిర్మించాలని రాష్ట్ర సీసీఐ కార్యవర్గసభ్యులు రామానాయుడు డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక పిఎస్‌ఆర్‌ కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశం లో ఆయన మాట్లాడుతూ సెయిల్‌ ఆధ్వర్యం లో ఉక్కుపరిశ్రమను స్థాపించాలన్నారు. తెలుగుగంగకు 29టిఎంసిలు, హంద్రీనీవాకు 40 టిఎంసిలు, గాలేరు-నగిరికి 38టిఎంసిలు, వెలి గొండ ప్రాజెక్టులకు 43.5 టిఎంి సల నిఖరజలాలను కేటాయించి. తగినన్ని నిధులు మంజూరుచేసి యుద్ధప్రాతిపదిక చర్యలు తీసుకోవాలన్నారు. కడపలో హైకోర్టును ఏర్పాటు చేయాలన్నారు. కడపలో ఉన్న రిమ్స్‌ను ఎయిమ్స్‌గా రూపొందించాలన్నారు.
ఇండియన్‌ మిలిటరీ అకాడమినికడపలో ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో ఉన్న ఆర్‌టిపిపి సామర్ధ్యాన్ని పెంచేందుకు ప్రస్తుతం ఉ్నన 1050 మెగావాట్‌లను, నిర్మాణంలో ఉన్ననున్న 600మెగావాట్స్‌లతో పాటుగా అదనంగా 800మెగావాట్లల విద్యుత్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా సిపి ఐ కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ జిల్లాలో భూమిలేని ఎస్సీ, ఎస్టీలకు కుటుంబానికి ఒక హెక్టారు భూమినిచ్చి హక్కుదాఖలుపర్చాలన్నారు. ఎర్రచందనం నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రీసర్చ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కార్యవర్గసభ్యులు పులిక్రిష్ణమూర్తి మా ట్లాడుతూ కడపలో బ్రహ్మణీ స్టీల్స్‌ వద్ద ఎయి ర్‌పోర్టు కోసం సేకరించిన 4500ఎకరాల్లో ఏరో నాటికల్‌ ఇంజినీరింగ్‌ కళాశాలను, ఏవియేషన్‌ ఇండియా లిమిటెడ్‌ను ఏర్పాటు చేయాలన్నా రు. కడప వినాశ్రయాన్ని జాతీయస్థాయికి కేటగిరిలో చేర్చివెంటనే ప్రారంభించాలన్నారు. జి ల్లాలో ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కళాశాలను ఏర్పాటుచేయాలన్నారు. కడప-బెంగుళూరు, ఓబులవారిపల్లె-క్రిష్ణపట్నం, యర్రగుంట్ల-నంద్యాల, భాకరాపేట-గిద్దలూరు లమధ్య రైల్వేలైన్‌లను ని ర్థిష్ట కాలవ్యధిలో పూర్తిచేయాలన్నారు. నందలూరులో లోకోషెడ్‌ను తిరిగి ఏర్పాటు చేయాలన్నారు. కడప- విజయవాడకు నాలుగులైన్లు హైవేరోడ్డును ఏర్పాటు చేయాలన్నారు. కడప-తిరుపతిల మధ్య కారిడార్‌ను ఏర్పాటు చేయాలన్నారు. సహకరంగంలో మాతపడిన ప్రోద్దుటూరు పాలకేంద్రం, చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీలను పునరుద్ధరించాలన్నారు. సిపిఐ సీ నియర్‌ నాయకులు సికెమూర్తి మాట్లాడుతూ ఖనిజ నిక్షేపాలు విస్తారంగా కల్గిన రాయలసీమలో నేషనల్‌మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ పరిశోధనాకేంద్రం ఏర్పాటు చేయాలన్నా రు. మైనింగ్‌ యూనివర్శిటిని స్థాపించాలన్నా రు. కోడూరు ఏరియా కార్యదిర్శి పండుగోలమ ణి మాట్లాడుతూ సౌత్‌ఇండియా టెక్స్‌టైల్స్‌ రీ సెర్చ్‌ కేంద్రాన్ని స్థాపించాలన్నారు. కోడూరులో సెంట్రల్‌ ఫుడ్‌ మరియు ఫ్రూట్‌ పరిశోధనాకేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సిపిఐ సీనియర్‌ నాయకులు శంకరయ్య మాట్లాడుతూ లె ౖమ్‌స్టోన్‌కు ప్రసిద్ధిగాంచిన కడపజిల్లాలో ప్రభుత్వరంగంలో భారీసిమెంట్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రవ్యవసాయ కార్మిక కమిటీ సభ్యురాలు ఓరుగంటినర్మదకుమారి మాట్లాడు తూ చంద్రబాబు ఇచ్చి హామీలను ప్రజలకు నెరవేర్చకపోతే మాత్రం ప్రజలు బుద్ధిచెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో ిసీపీఐ నాయకులు రాధాక్రిష్ణ, నాయకులు చెన్నయ్య, శ్రీరా ములు, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారుత,ఖిర-5ట