desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 19 2014 @ 03:30AM

మలేషియా తరహాలో రోడ్ల అభివృద్ధి

కర్నూలు (కార్పొరేషన్‌): మలేషియా తరహాలో రా ష్ట్రంలో రోడ్లు అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. గురువారం స్థానిక బళ్లారి రోడ్డులోని రేడియో స్టేషన్‌ వద్ద రూ. 133.57 కోట్ల వ్యయంతో చేపడుతున్న కర్నూలు - దేవనకొండ రహదారి విస్తరణ పనులకు ఉప ముఖ్యమంత్రి కేఈ, రోడ్లు, భవనా ల శాఖ మంత్రి సిద్దా రాఘవరావు శంకుస్థాపన గావించా రు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఉప ముఖ్యమంత్రి కేఈ మాట్లాడుతూ కర్నూలు - దేవనకొండ రహదారి శిథిలావస్థకు చేరడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బం ది పడుతున్నారని, ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే నిధులు మంజూరుచేశారన్నారు. రహదారులు అభివృద్ధికి చిహ్నమని ఆయన అన్నారు. మలేషియాలో రోడ్లు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, జారి పోయేలా ఉన్నాయని, ఆ తరహాలో మన రహదారులను అభివృద్ధి చేస్తామని అన్నారు. కర్నూలు - దేవనకొండ రహదారిని సూపర్‌రోడ్డుగా మారుస్తామని, పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని కేఈ హెచ్చరించారు. రోడ్లు, భవనాల మంత్రి సిద్ధారాఘవరావు మా ట్లాడుతూ రాష్ట్ర రహదారులకు భారతదేశంలోనే గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సం బంధించి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సర్వే నిర్వహించినట్లు తెలిపారు. గ్రామస్థాయి మండలస్థాయి, జిల్లా స్థాయి వరకు సింగిల్‌ రోడ్లను 2, 4, 6, 8 లైన్ల రోడ్లుగా అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తామన్నారు. కర్నూలు- దేవనకొండ రోడ్ల విస్తరణ పనులకు రెండు సంవత్సరాలలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి కలిసి కట్టుగా కృషి చేయాలని కోరారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కేఈ కృషి ఫలితంగానే రోడ్డు విస్తరణ పనులు మంజూరయ్యాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్‌రెడ్డి, మణిగాంధీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, డోన్‌ ఇన్‌చార్జ్‌ కేఈ ప్రతాప్‌, కలెక్టర్‌ విజయమోహన్‌, ఎస్‌పీ రవికృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి, రోడ్లు, భవనాల శాఖ ఎస్‌ఈ రాజీవ్‌రెడ్డి, ఈఈలు నాగరాజు, శ్రీధర్‌రెడ్డి, టీడీపీ నాయకులు మల్లెల పుల్లారెడ్డి, జంపాల మధు, తిరుపాలుబాబు, సతీష్‌చౌదరి, నంద్యాల నాగేంద్ర పాల్గొన్నారు.