Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 19 2014 @ 03:25AM

దుర్గమ్మ సేవలో మంత్రి గంటా


వన్‌టౌన్‌: దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో కనకదుర్గమ్మను రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు మం త్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధికి తోడ్కొని వెళ్ళి ప్రత్యేక పూజ నిర్వహించగా, ఆలయ వేదపండితులు ఆశీర్వచన మండపంలో అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. ఏఈవో మంత్రికి అమ్మ వారి చిత్రపటం, శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం బహూ కరించారు. పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావుఉన్నారు.
దసరా ఉత్సవాలపై కలెక్టర్‌ సమీక్ష 20న
దసరా మహోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 20న సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించనున్నారు.