Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 19 2014 @ 03:20AM

యథేచ్ఛగా క్యాట్‌ఫిష్‌ పెంపకం


అద్దంకి: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడేలా క్యాట్‌ఫిష్‌ పెంపకం దా రులు వ్యవహరిస్తున్నారు. క్యాట్‌ ఫిష్‌ పెంపకంపై పూర్తిగా నిషేధం కొనసాగుతున్నా అద్దంకి ప్రాంతంలో మా త్రం యథేచ్ఛగా చెరువులలో పెంచుతూనే ఉన్నారు. మత్స్యశాఖ అధికారు లు ఉదాశీనంగా వ్యహరిస్తుండటంతో ఇటీవల కాలంలో పెంపకం మరింత పెరిగింది. గతంలో చాటుమాటుగా సాగిన క్యాట్‌ ఫిష్‌ పెంప కం ఇటీవల కాలంలో మాత్రం విచ్చలవిడిగా పెరిగిపోయిం ది. ఇతర జిల్లాల నుంచి వచ్చి చెరువులను లీజు కు తీసుకొని క్యాట్‌ ఫిష్‌ పెంపకం చేపడుతున్నా రు. అధికారులు తనిఖీలకు పోయిన సమ యంలో ఏవో మారుపేర్లు చెబుతూ క్యాట్‌ ఫిష్‌ కాదని తోసి పుచ్చుతున్నారు. క్యాట్‌ ఫిష్‌ మినహా మిగిలిన ఏ చేపలకు ఆహా రంగా చనిపోయిన జంతువుల కళేభరాలను, మాంసం వ్యర్ధాల ను ఆహారంగా అందించరనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసినదే. సాధారణ చేపల పెంపకం కోసం దాణాను ఉపయోగిస్తారు. ఒక్క క్యాట్‌ ఫిష్‌ పెంపకానికి మాత్రం జంతువుల కళేబరాలను, మాంసం వ్యర్థాలను ఉప యోగిస్తారు. చికెన్‌ దుకాణాల వద్ద వ్యర్థాలను, గ్రామాలలో చనిపోయిన జంతువుల కళేభరాలను ప్రత్యేకంగా సేకరించి చెరువుల వద్దకు తరలిస్తారు. చెరువుల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్ఖానాలో ఉడికించి అనంతరం మేతగా క్యాట్‌ ఫిష్‌కు అం దిస్తుంటారు. చనిపోయిన జంతువుల కళేభరాలు, వ్యర్థాలను ఉడికిస్తుండటం, క్యాట్‌ఫిష్‌ కు ఆహారంగా వేస్తుండటంతో చెరువులలోని నీరు పూర్తిగా రంగుమారిపోతున్నాయి. చెరువులు ఉన్న ప్రాంతమంతా ధుర్వాసన వెదజల్లుతుంది. దీనికి తోడు ఆ వాసన సమీప గ్రామాలకు కూడా వ్యాపిస్తుండటంతో వ్యాధులు ప్రబలుతు న్నా యి. అధికారులు ఉదాశీనంగా వ్యవహరిస్తుండటంతో క్యాట్‌ ఫిష్‌ పెంపకందారులు రెచ్చిపోతున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరో పిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్న తాధికారులు దృష్టి పెట్టి క్యాట్‌ ఫిష్‌ పెంపకాన్ని నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
క్యాట్‌ ఫిష్‌ పెంచితే కఠిన చర్యలు
మత్స్యశాఖ అధికారి రాజ్‌కుమార్‌
క్యాట్‌ ఫిష్‌ పెంపకం చేపడితే కఠి న చర్యలు తీసుకోవడం జరుగుతుందని మత్స్యశాఖ అధికారి రాజ్‌కుమా ర్‌ తెలిపారు. చెరువులలో పెంచుతు న్న చేపలను పరిశీలించడంతో పాటు మేతకు వినియోగించే పదా ర్థాలను కూడా పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.్ఙఙజూజిజ్ణ్యక,ఖిెఢ5ట