Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 19 2014 @ 01:24AM

అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల కోసం ఎమ్మెల్యేను కలిసిన రైతులు


జిన్నారం: మండలకేంద్రమైన జిన్నారం పంచాయతీ పరిధిలో నాలుగు గ్రామాలకు ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేయాలని రైతులు, నాయకులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని కలిశారు. గురువారం టీఆర్‌ఎస్‌ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్‌, నాయకు లు శంకర్‌రెడ్డి, సంజీవ, శంకరప్పల ఆధ్వర్యంలో జిన్నారం, జంగంపేట, పెద్దమ్మగూడెం గ్రా మాల రైతులు ఎమ్మెల్యేను కలిశారు. తరచూ విద్యుత్‌కోతలు, లోవోల్టేజీ కారణంగా వ్యవసా య బోర్లు, నివాసాలకు విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు కల్గుతున్నాయని, వెంటనే అదన పు ట్రాన్స్‌ఫార్మర్లను మంజూరు చేయించాలని ఎమ్మెల్యేను కోరారు. స్పందించిన ఎమ్మెల్యే జిల్లా విద్యుత్‌ అధికారులతో మాట్లాడి పది రో జుల్లో నాల్గుట్రాన్స్‌ఫార్మర్లు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.