Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 19 2014 @ 01:08AM

హెచ్‌ఎండీఏ కమిషనర్‌పై బదిలీ వేటు


ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ: ఐఏఎస్‌ అధికారుల పంపకం తుది దశకు చేరుకుంది. మార్పుల ముసాయిదా జాబితాను ప్రత్యూష్‌ సిన్హా కమిటీ ప్రధానమంత్రి కార్యాలయానికీ పంపింది. ప్రధాని నరేంద్రమోదీ ఆమోదమే తరువాయి.. అధికారుల విభజన పూర్తవుతుంది. ఈ నెలాఖరుకు ఐఏఎస్‌ల కేటాయింపులు జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెల రోజులుగా ప్రకియ్ర జరుగుతున్న క్రమంలో.. ఇన్నాళ్లూ ఐఏఎస్‌ల బదిలీల ఊసెత్తని తెలంగాణ సర్కారు.. గురువారం ఉన్నట్టుండి హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) కమిషనర్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ను బదిలీ చేస్తు ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్నాళ్లుగా ఆయనపై అభియోగాలు ఎక్కువవడం వల్లే సీఎం కేసీఆర్‌ జోక్యం చేసుకొని బదిలీ చేయించారని తెలుస్తోంది. త్వరలో ఐఏఎస్‌ల కేటాయింపులు పూర్తయే అవకాశం ఉన్పప్పటికీ.. అప్పటివరకూ ఆయనను భరించడం సర్కారుకు చెడ్డ పేరు వస్తుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. నీరబ్‌కుమార్‌ను బదిలీ చేస్తూ జీఓ జారీ చేసిన సాధారణ పరిపాలనా శాఖ.. ఆయన స్థానంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక శాఖ కార్యదర్శి ప్రదీప్‌చంద్రకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. వెంటనే జీఓ అమలులోకి వస్తుందని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ప్రదీప్‌ చంద్ర ఆ పోస్టులో కొనసాగుతారని పేర్కొన్నారు. నీరబ్‌కుమార్‌కు పోస్టింగ్‌ కూడా ఇవ్వకపోవడం గమనార్హం.
అయినా ఉండేందుకు..
1987 బ్యాచ్‌కు చెందిన నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ తెలంగాణ ఆప్షన్‌ ఇచ్చారు. రోస్టర్‌ విధానంలో ఆయన ఏపీకి కేటాయించడం జరిగింది. తెలంగాణలో కొనసాగేందుకు ఆసక్తితో ఉన్న నీరబ్‌.. ఢిల్లీకి వెళ్లి మరీ ఆప్షన్‌ మార్చుకునేందుకు ప్రయత్నాలు చేశారని ప్రచారం జరిగింది. ఐఏఎస్‌ల ఎంపికకు ముందు.. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం వద్దా లాబీయింగ్‌ చేశారనే వ్యాఖ్యలూ వినిపించాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో మాజీ సీఎం సోదరుడికి సన్నిహితుడిగా పేరుగాంచిన నీరబ్‌ వైఖరిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన వచ్చిన తరువాత ప్రణాళికా విభాగంలో అవినీతి ఎక్కువైందని చెబుతారు. కొన్నాళ్ల క్రితం పలువురు బిల్డర్లు అనుమతుల జారీలో జాప్యంపై ప్రభుత్వం వద్ద మొర పెట్టుకున్నట్లు తెలిసింది. తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రభుత్వంతో సఖ్యంగా ఉండేందుకు యత్నించినా.. గతంలో ఆయన వ్యవహారశైలి, ఏపీకి కేటాయించిన అనంతరం అభియోగాలు మరింత ఎక్కువవడం వల్లే ఆకస్మిక బదిలీ వేటు పడిందనే భావన వ్యక్తమవుతోంది.
రెండున్నరేళ్లు..
ఏప్రిల్‌ 2012లో నీరబ్‌కుమార్‌ హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. రెండున్నరేళ్లపాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన హయాంలో పనుల్లో స్వల్ప పురోగతి కనిపించిది.. కానీ మెజార్టీ ప్రాజెక్టులు అసంపూర్తిగానే మిగిలాయి. 33 కిలోమీటర్ల మేర ఔటర్‌ పనులు నెమ్మదిగా సాగుతున్నా.. వాటిని వేగవంతం చేసేందుకు ఎలాంటి చొరవ తీసుకోలేదు. నీరబ్‌ బాధ్యతలు చేపట్టాక ప్రణాళికా విభాగంలో ఆరోపణలు వచ్చాయి. మేడ్చల్‌ జోనల్‌ కార్యాలయంలో డీడీల కుంభకోణం, శంకర్‌పల్లిలో ఫైళ్ల దహనం దీనికి పరాకాష్ట. మియాపూర్‌లో బస్‌ టెర్మినల్‌ ప్రాజెక్టులో రెండేళ్లలో కనీస పురోగతి కూడా కనిపించలేదు. హెబిటాట్‌ సెంటర్‌, సైన్స్‌సిటీ, మైస్‌ వంటి పీపీపీ ప్రాజెక్టులు కాగితాలకే పరిమితమమయ్యాయి. పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే ర్యాంపుల నిర్మాణం సా...గుతోంది. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన.. పూడికతీత అవరోధాన్ని అధి గమించడం లేదు. మాస్టర్‌ప్లాన్‌-2031 గతేడాది జనవరిలో అమలులోకి వచ్చినా.. ఇప్పటికీ అందులో ప్రతిపాదించిన ట్రక్‌ టెర్మినల్స్‌, అర్బన్‌ నో డ్స్‌ వంటివి అమలుకు నోచుకోలేదు. ఆన్‌లైన్‌ అనుమతుల జారీ.. చెరువులు పరిరక్షణకు కొంత ప్రాధాన్యమిచ్చారు. ఆన్‌లైన్‌ సేవలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన బాధ్యతలను అస్కీకి అప్పగించారు. సఊఐ;‘7్ట