Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 19 2014 @ 00:04AM

విలీన మండలాల్లో అభివృద్ధికి పెద్దపీట


ఫఏలూరు ఎంపీ మాగంటి బాబు
వేలేరుపాడు సెప్టెంబర్‌ 18: ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఖమ్మం జిల్లా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని ‘మీరూ మా వారేనని’ ఈ ప్రాం త ఎంపీగా అన్నివేళలా అందు బాటులో ఉంటానని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) హామీ ఇచ్చారు. పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌, కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌, ఎస్పీ రఘురామ్‌రెడ్డి తదితరులతో కలిసి గురువారం వేలేరుపాడు మండలంలో ఆయన పర్యటించారు. ఏపీలో విలీనమైన ఈ రెండు మండలాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తామని, రాష్ట్ర నిర్మాణానికి ప్రతిఒక్కరూ సహకారించాలని మాగంటి కోరారు. పంటనష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి తక్షణమే నష్టంపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ తదితర అధికార బృందానికి చూపించాలన్న రైతులకు ఆశాభంగమైంది. సమస్యలపై వందలాది మంది దరఖాస్తులు ఇచ్చేందుకు ఎగబడటంతో సమీక్ష సమావేశాన్ని ఆపేసి వాటిని స్వీకరించారు.