Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 18 2014 @ 06:52AM

ప్రత్యేక రైళ్లకు పచ్చజెండా



విశాఖపట్నం: దసరా రద్దీని దృష్టిలో పెట్టుకొని తూర్పు కోస్తా రైల్వే యంత్రాంగం ప్రత్యేక ప్రీమియం రైళ్లను ప్రవేశపెట్టింది. విశాఖ మీదుగా భువనేశ్వర్‌, పూణే, దువ్వాడ మీదుగా మైసూరు, సంత్రాగచ్చి మధ్య వారాంతపు రైళ్లు ఈనెల 21 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఎం.యల్వేందర్‌యాదవ్‌ తెలిపారు.
భువనేశ్వర్‌-పూణే (02882)
02882 నంబర్‌ గల రైలు ప్రతి ఆదివారం రాత్రి 10.15 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి మర్నాడు (సోమవారం) ఉదయం 4.40 గంటలకు విశాఖ చేరుతుంది. తిరిగి ఇక్కడ నుంచి 5.00 గంటలకు బయలుదేరి మర్నాడు (మంగళవారం) ఉదయం 5.00 గంటలకు పూణే చేరుతుంది. ఈ రైలు ఈనెల 21 నుంచి నవంబర్‌ 30 వరకూ అందుబాటులో వుంటుంది.
పూణే-భువనేశ్వర్‌ (02881)
02881 నంబర్‌ గల రైలు ప్రతి మంగళవారం ఉదయం 11.15 గంటలకు పూణేలో బయలుదేరి మర్నాడు (బుధవారం) ఉద యం 10.25 గంటలకు విశాఖ చేరుతుంది. తిరిగి ఇక్కడ నుంచి 10.45 గంటలకు బయలుదేరి అదేరోజు సాయంత్రం 5.35 గంటలకు భువనేశ్వర్‌ చేరుతుంది. ఈ రెలు ఈనెల 23 నుంచి డిసెంబర్‌ రెండు వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ సర్వీసులు పది స్లీపర్‌ క్లాసు, ఒక ఽథర్డ్‌ ఏసీ, ఒక సెకెండ్‌ ఏసీ, రెండు జనరల్‌ క్లాస్‌ సిట్టింగ్‌ కమ్‌ లగేజీ, ఒక ప్యాంట్రీ కారు కోచ్‌లతో బరంపురం, విశాఖపట్నం, విజయవాడ, సికింద్రాబాద్‌, వాడి మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
మైసూరు-సంత్రాగచ్చి (02683/02684)
02683 నంబర్‌ గల రైలు ప్రతి బుధవారం ఉదయం 6.00 గంటలకు మైసూరులో బయలుదేరి మర్నాడు (గురువారం) ఉదయం 2.00 గంటలకు దువ్వాడ చేరుతుంది. తిరిగి 2.02 గంటలకు బయలుదేరి అదేరోజు మధ్యాహ్నం 3.45 గంటలకు సంత్రాగచ్చి చేరుతుంది. ఈ రైలు ఈనెల 24 నుంచి అక్టోబర్‌ 29 వరకూ ఆరు ట్రిప్పులు అందుబాటులో వుంటుంది.తిరుగు ప్రయాణంలో 02684 నంబర్‌ గల రైలు ప్రతి శుక్రవారం ఉదయం 5.50 గంటలకు సంత్రాగచ్చిలో బయలుదేరి అదేరోజు రాత్రి 8.43 గంటలకు దువ్వాడ చేరుతుంది. తిరిగి 8.45 గంటలకు బయలుదేరి మర్నాడు సాయంత్రం 4.45 గంటలకు మైసూరు చేరుతుంది. ఈ రైలు ఈనెల 26 నుంచి అక్టోబర్‌ 31 తేదీ వరకూ అందుబాటులో వుంటుంది. ఈ సర్వీసులు 12 స్లీపర్‌ క్లాసు, ఒక సెకెండ్‌ ఏసీ, రెండు థర్డ్‌ ఏసీ, రెండు సెకెండ్‌ క్లాస్‌ సిట్టింగ్‌ కమ్‌ లగేజీ కోచ్‌లతో బెంగుళూరు సిటీ, జోలార్‌పెట్టాయ్‌, విజయవాడ, దువ్వాడ, భువనేశ్వర్‌, ఖర్గపూర్‌ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. తక్కువ స్టాపేజీలతో నడిచే ఈ ప్రీమియం రైళ్లకు బెర్తు ఖరారు టికెట్లు మాత్రమే లభిస్తాయి. నిరీక్షణ జాబితాలో టికెట్‌ జారీ చేయరు. అలాగే బెర్తుల ఖాళీలు, డిమాండ్‌కు అనుగుణంగా టికెట్‌ చార్జీల్లో మార్పులు చోటుచేసుకుంటాయి.