Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 18 2014 @ 05:10AM

చర్యలు తీసుకుంటాం : మంత్రి యనమల




‘‘షిప్పింగ్‌యార్డులో పలు షిప్పులు బ్రేక్‌ చేసే విషయమై సమాచారం వచ్చింది. దీనిని పరిశీలించి సంబంధిత వ్యక్తులపై చర్యలు చేపట్టేందుకు అధికారులతో చర్చిస్తామ’’ని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.


నవ్యాంధ్ర నిర్మాణంలో ‘తూర్పు’ టాప్‌
అభివృద్ధిలో జిల్లాకు
ప్రథమ ప్రాధాన్యం
ప్రాజెక్టుల ఆధునికీకరణకు
చర్యలు
పరిశ్రమల ఏర్పాటుపై
పారిశ్రామికవేత్తలతో చర్చలు
సీ ప్లేన్‌ల ఏర్పాటుకు ఆలోచన
రాజమండ్రి
విమానాశ్రయం విస్తరణ
ఇసుక మాఫియాపై ఉక్కుపాదం
ఎస్‌ఈజెడ్‌లో రైతులకు మెరుగైన ప్యాకేజీ
త్వరలో డీఎస్సీ, పోలీసు రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్లు
ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు


కాకినాడ సిటీ : నవ్యాంధ్ర నిర్మాణంలో తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రఽథమ ప్రాధాన్యత ఇస్తుందని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. జిల్లా సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని అన్నారు. బుధవారం కాకినాడలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన జిల్లా అభివృద్ధిపై వివిధ అంశాలను వివరించారు. ఆయన మాటల్లోనే..
ఫ మెట్ట అనే పదం ఉండదు : ‘జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టులు అభివృద్ధిలో భాగంగా రానున్న రోజుల్లో మెట్ట ప్రాంతం సస్యశ్యామలం కానుంది. పోలవరం, పుష్కర, చాగల్నాడు, సూరంపాలెం, ముసురుమిల్లి, ఏలేరు ప్రాజెక్టులను ఆధునికీకరిస్తాం. మెట్ట ప్రాంతంలో మెట్ట అనే పదానికి తావు లేకుండా చేస్తాం’ అని యనమల చెప్పారు.
ఫ భారీ పరిశ్రమలు రాక : ‘జిల్లాలో పెద్దఎత్తున పారిశ్రామికీకరణ సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక మంది పారిశ్రామికవేత్తలతో చర్చలు నిర్వహిస్తోంది. జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే కాకినాడలో ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ను రూ.250 కోట్లతో నిర్మాణంలో ఉంది. కాకినాడ పోర్టుకు అభివృద్ధిలో భాగంగా కమర్షియల్‌ పోర్టును కాకినాడ-తుని ప్రాంతంలో నెలకొల్పనున్నాం. పోర్టు అభివృద్ధి జరిగితే కంటైనర్‌ల ద్వారా ఎగుమతులు, దిగుమతులకు సులువుగా ఉంటుంది. ఐటీ రంగం అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే హార్డ్‌వేర్‌ సెంటర్‌ కానుంది’ అని ఆయన వివరించారు.
ఫ పర్యాటకులను ఆకర్షిస్తాం : ‘పర్యాటక రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. నూతన ఆలోచనలతో పర్యాటకులను ఆకర్షించేందుకు అనేక ప్రాజెక్టులు తీసుకు వస్తున్నాం. హోప్‌ ఐలాండ్‌, అంతర్వేది నుంచి గోదావరి మీదుగా భద్రాచలం వరకు..., సముద్ర, గోదావరి తీర ప్రాంతాల్లో పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా అనేక ప్రాజెక్టులను తీసుకుని వస్తున్నాం. ప్రధానంగా పర్యాటక రంగం అభివృద్ధికి కాకినాడ బీచ్‌ కీలకంగా మారనుంది. వివిధ పర్యాటక ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు వీలుగా సీప్లేన్‌ (విమానాలను) తీసుకువచ్చే ఆలోచన ఉంది. కాకినాడ బీచ్‌ను పర్యాటకులు ఆకర్షించేందుకు వీలుగా అభివృద్ధి చేస్తాం. ఈకో టూరిజం అభివృద్ధికి బకింగ్‌హమ్‌ కెనాల్‌ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం’ అని తెలిపారు.
ఫ విమానాశ్రయానికి 500 ఎకరాలు : ‘రాజమండ్రి విమానాశ్రయాన్ని ఆధునీకరిస్తాం. విస్తరణలో భాగంగా 500 ఎకరాలు సేకరిస్తున్నాం. భూసేకరణకు కలెక్టర్‌ త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ఏడీబీ రోడ్డును అభివృద్ధి చేసి రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం’ అని యనమల చెప్పారు.
ఫ ఇసుక మాఫియాపై ఉక్కుపాదం : జిల్లాలో ఇసుక, మైనింగ్‌ మాఫియా వల్ల అభివృద్ధి కుంటుపడింది. వీటిపై ఉక్కుపాదం మోపుతాం. ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ ఏర్పాటు వల్ల తీర ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలతోపాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు రానున్నాయి. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం. ఎస్‌ఈజెడ్‌లో రైతులకు మెరుగైన ప్యాకేజీ అందజేసేందుకు చర్యలు చేపడుతున్నాం. రైతు కుటుంబానికి ఒక ఉద్యోగం ఏర్పాటుకు అవకాశం ఉంది. వచ్చే ఏడాది పుష్కరాల నిర్వహణకు బడ్జెట్‌లో రూ.100 కోట్లు నిధులు కేటాయించాం’ అని యనమల తెలిపారు. సమావేశంలో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జడ్పీ చైర్మన్‌ నామన రాంబాబు, రాష్ట్ర టీడీపీ బీసీ సెల్‌ అఽధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.