desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 18 2014 @ 04:11AM

ఏబీఎన్‌, టీవీ 9 ప్రసారాలను పునరుద్ధరించాలంటూ ప్రధానికి లేఖలు


హుజూరాబాద్‌ టౌన్‌: ఏబీఎన్‌, టీవీ9 ప్రసారాలను తెలంగాణలో పునరుద్దరించాలని కోరుతూ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు బుధవారం ప్రధాని నరేంద్రమోదీకి లేఖలు రాశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను కా లరాస్తోందన్నారు. వ్యవస్థ లోటుపాట్లను సరిదిద్దేందుకు మీడి యా కృషి ఎనలేనిదన్నారు. నిజాలను నిర్భయంగా వెల్లడించే ఏబీఎన్‌ ఛానల్‌ను ఏ తప్పు చేసిందని అడ్డుకుంటున్నారని ప్ర శ్నించారు.లోపాయికారంగా ఎంఎస్‌వోలను ప్రభుత్వం ఛానళ్లను ప్రసారం చేయకుండా అడ్డుకుంటుందని వారు ఆరోపించారు. తక్షణమే ఛానళ్లు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ప్రధానికి వారు లేఖలో కోరారు. కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పర్లపల్లి రవిందర్‌, నియోజకవర్గ ఇంచార్జీ టేకుల శ్రావణ్‌, నాయకులు అకినపల్లి శ్రావణ్‌, రాజ్‌కుమార్‌, నరేష్‌, శరత్‌, శివ, సాయిచరణ్‌, పెండ్యాల రాజేష్‌, అరవింద్‌, వివేక్‌ త దితరులు పాల్గొన్నారు.