Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 18 2014 @ 04:08AM

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి ఆత్మహత్య

ధర్మపురి: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ధర్మపురి మండలంలోని గోపులాపూర్‌ గ్రామంలో దండవేని వెంకటరమణ (40) అనే వ్యక్తి అప్పుల భాధ భరించలేక మంగళవారం రాత్రి ఉరి వేసుకున్నట్లు ఎస్‌ఐ దేవయ్య తెలిపారు. వెంకటరమణ తన అవసరాల నిమిత్తం చేసిన అప్పులు తీర్చలేని స్థితిలో తీవ్ర మనస్తాపం చెంది ఇంటిలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. మృతుని భార్య సుగుణ ఫిర్యాదు మేరకు శవ పంచానామా జరిపి పోస్టుమార్టం కోసం జగిత్యాల ఆసుపత్రికి పంపించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కడుపు నొప్పి భరించలేక వృద్ధురాలి..
సారంగాపూర్‌: మండలంలోని పోతారం గ్రామ పరిధిలో గల గణేశ్‌పల్లికి చెందిన తల కొండ పోచవ్వ(60) అనే వృద్ధురాలు కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకొంది. గుడిసెలో మంగళవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొందని మృతురాలి భర్త పోచయ్య ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
హోంగార్డు..
పెద్దపల్లి రూరల్‌: పెద్దపల్లి మండలంలోని బొంపల్లి గ్రామానికి చెందిన మస్తెం రమేశ్‌ అలియాస్‌ సతీష్‌(30) అనే హోంగార్డు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతకాలం బసంత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పని చేసిన సతీష్‌ ఇటీవల పెద్దపల్లిలోనే హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. సతీష్‌ ఆదివారం పురుగులమందు తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పెద్దపల్లిలో ప్రథమ చికిత్స జరిపిన అనంతరం కరీంనగర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ బుధవారం సతీష్‌ మృతి చెందినట్లు బం ధువులు తెలిపారు.
మృతుడికి భార్య శ్రీలత, ఇద్దరు కుమారులున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కిషోర్‌ తెలిపారు.