desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 18 2014 @ 04:07AM

ఘనంగా విలీన దినోత్సవం

కరీంనగర్‌ రూరల్‌ : మండలంలోని పలు గ్రామాల్లో విలీన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. బొమ్మకల్‌ శివారులో సిమెంట్‌ గోదాంల వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ అధికారికంగా ఉత్సవాలను నిర్వహించకపోవడం సిగ్గు చేటన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లి సహాయ కార్యదర్శి కొమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, ఏఐకెఎస్‌ జిల్లా అద్యక్షుడు కాల్వ నర్సయ్యయాదవ్‌, సీపీఐ నగర కార్యదర్శి పైడిపెల్లి రాజు, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పంజాల శ్రానివాస్‌, నాయకులు జంగం తిరుపతి, ఎన్‌ కొమురయ్య పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినం
ఎలబోతారం గ్రామంలో బీజేపీమండల శాఖ, వండర్స్‌ యూత్‌ వెల్ఫేర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోదుడు మారం గోపయ్య పటేల్‌ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రదాన మంత్రి నరేంద్రమోడి జన్మదిన వేడుకలను ప్రాథమిక ఉన ్నత పాఠశాలలో నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లెత్తుల దేవేందర్‌, మండల అధ్యక్షుడు పబ్బతి సతీష్‌రెడ్డి, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి పొలగాని అంజయ్య, వేల్పుల శ్రీనివాస్‌, వార్డు సభ్యులు ప్రసాద్‌, నాయకులు గాండ్ల అజయ్‌, ముసాని మహేందర్‌, సంపత్‌, కిషన్‌, దర్మయ్య, పైడి సంపత్‌ పాల్గొన్నారు. పద్మనగర్‌ గ్రామంలో శివాజీ యూత్‌ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఎంపీటీసీ శివకుమార్‌ జాతీయ జెండా ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో విశ్రాంత డిగ్రీ కళాశాల ఉపన్యాసకులు మచ్చహరిదాసు, ఉప సర్పంచ్‌ బూర కుమార్‌, వార్డు సభ్యులు మల్లేశం, మురళీ, సుధాకర్‌, శివాజీ యూత్‌ సమితి అద్యక్షుడు గుడెల్లి శ్రీనివాస్‌, బీజేపీ నాయకులు సొల్లెటి సుభాష్‌, పరశురాం, మేకల రాజనర్సయ్య పాల్గొన్నారు.