Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 18 2014 @ 04:00AM

అమ్మే ఆదర్శం..

గుంటూరు: చిన్నప్పటి నుంచి డాక్టర్‌ కావాలనుకున్నా... కొద్దిలో అవకాశం చేజారిపోవడంతో అమ్మ ప్రోత్సాహంతో డ్రిల్‌ టీచర్‌ అయ్యా... ఎక్కువమంది ప్రజలకు న్యాయం చేయాలంటే పోలీసు కావాలనుకున్నా... అందుకే ఎస్‌గా పోలీస్‌ శాఖలో చేరా... ఏ లక్ష్యంతో పోలీస్‌శాఖలో చేరా నో... ఆ లక్ష్యం దిశగా పయనిస్తూ ప్రస్తుతం అద నపు ఎస్పీగా ఉద్యోగోన్నతి పొందానని రూరల్‌ సీసీఎస్‌ అదనపు ఎస్పీ శోభా మంజరి స్పష్టం చేశారు. ఇటీవల ఆమె రూరల్‌ సీసీఎస్‌ అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఆమె తన మనోగతాన్ని ఆంధ్రజ్యోతితో పంచుకున్నారు. తండ్రి జోసఫ్‌, తల్లి సుగుణ. కుటుంబంలో నేనే పెద్దదానిని. ముగ్గురు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. మా నాన్నది తెనాలి ఐతా నగర్‌. నాన్న విజయవాడ రైల్వేలో సీనియర్‌ రైల్వే క్యాషియర్‌గా పని చేశారు. అమ్మ ఏలూరులో టీచర్‌గా పని చేసేది. మా కుటుంబం ఏలూరులో ఉండేది. అయితే చిన్నప్పుడే మా నాయనమ్మ నన్ను తెనాలి తీసుకువెళ్లింది. ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు తెనాలిలో చదివాను. నాకు డాక్టర్‌ కావాలని ఉండేది. నాయనమ్మ కూడా నన్ను డాక్టర్‌ చేయాలనుకుంది. ఈ క్రమంలో ఇంటర్మీడియెట్‌లో బైిపీసీ గ్రూప్‌ తీసుకున్నా... ఇందుకు గాను 1983లో గుంటూరులో కోచింగ్‌ కూడా తీసుకున్నా.. అయితే కొద్దిలో అవకాశం చేజారిపోయింది. ఇంతలో అమ్మ నన్ను ఏలూరు తీసుకువెళ్లింది. ఆ తరువాత బీపీఈడీ చేశా.. నేనే కాక కు టుంబంలోని వారంతా బీఎడ్‌, బీపీఈడీ చేశారు. అప్ప ట్లో మొదటిసారిగా ఎన్టీ రామారావు గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. నాకు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండల పరిధిలోని నాగిరెడ్డిగూడెం గురుకుల పాఠశాలలో డ్రిల్‌ టీచర్‌గా ఉద్యోగం వచ్చిం ది. ఐదేళ్ల పాటు పీడీగా పనిచేశా. ఇంటర్మీడియెట్‌లోనే ఎన్‌సీసీ సి సర్టిఫికెట్‌ పొందాను. పీడీగా చేస్తూనే ఎంఏ, బీఎడ్‌, బీఎల్‌ పూర్తి చేశా...
ఎక్కువ మందికి న్యాయం చేయడం కోసమే..
ఎక్కువ మందికి న్యాయం చేయాలంటే పోలీస్‌ కావాలని భావించా... ఇందుకు అమ్మ కూడా ప్రోత్సహించింది. దీంతో 1989లో ఎస్‌ఐగా ఎంపికయ్యా. 1990 నుంచి ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ తదితర చోట్ల వివిధ హోదాల్లో విధులు పనిచేశా. 1996లో ఎస్‌ఐగా ఉన్న సమయంలోనే వివాహమైంది. మాకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. పోలీసులంటే భయం, గౌరవం రెండు ఉంటాయి. పోలీసుగానే కాక పలు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనటం నాకిష్టం. ఈ క్రమంలో పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.
మహిళలకు న్యాయం చేయడానికి కృషి చేస్తున్నా..
పోలీసుగా ఎంత వరకు ప్రజలకు న్యాయం చేయగలుగుతానో అంత వరకు న్యాయం చేయడానికి కృషి చేస్తున్నా. ముఖ్యంగా మహిళా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపటం జరుగుతుంది. కళాశాలలో ఈవ్‌టీజింగ్‌, ర్యాగింగ్‌పై అవగాహన సదస్సులు, మహిళల అక్రమ రవాణా, వ్యభిచారం అరికట్టేందుకు చర్యలు తీసుకొంటున్నా.. బాలల హక్కులు కాపాడేందుకు నవజీవన్‌ సంస్థలో సభ్యురాలిగా ఉన్నా. మహిళా సంక్షేమ శాఖ ద్వారా కూడా మహిళలకు న్యాయం చేయడానికి కృషి చేస్తున్నా.
పోలీస్‌ శాఖలోకి ఎక్కువ మంది మహిళలు రావాలి..
ప్రస్తుతం పోలీస్‌ శాఖలోకి వచ్చే మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది. పెరుగుతున్న నేరాలు, మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, నేరాలలో పురుషులతో పోటీ పడుతున్న మహిళలను నియంత్రించేందుకు పోలీసు శాఖలో మహిళల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఈ శాఖలోనే మహిళలకు ఎక్కువ గౌరవం లభిస్తుంది. పీజీ, బీటెక్‌ చేసిన వారు సైతం కానిస్టేబుల్‌గా వస్తున్నారు. ప్రొఫెషనల్‌ కోర్సులు చేసిన యువత వస్తుండటంతో తోటి ఉద్యోగులతో గౌరవంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పోలీస్‌శాఖలోకి రావడానికి భయం కాని, అపోహ కాని ఉండకూడదు.
రూరల్‌ జిల్లా పరిధిలో నేరాలు నియంత్రించేందుకు ఓ కొత్త ప్రాజెక్టు రూపొందించాలని ఎస్పీ రామకృష్ణ భావిస్తున్నారు. ఆయన ఆలోచన మేరకు త్వరలో ఓ కొ త్త కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటున్నా... నేరా లు గతంలో కంటే భిన్నంగా మారాయి. కొత్త వ్యక్తులు, కొత్త నేరాలకు పాల్పడుతున్నారు. అనేక కొత్త తరహా మోసాలకు కూడా తెరతీస్తున్నారు. వీటన్నింటిని అరికట్టేందుకు ఓ కొత్త కార్యక్రమం రూపొందించి సీసీఎస్‌ ద్వారా మెరుగైన సేవలు అందించాలని భావిస్తున్నాం.