Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 18 2014 @ 03:30AM

‘కారుణ్య’ నిబంధనల సడలింపు


హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ పోస్టుల్లో కారుణ్య నియామకాలు, పదోన్నతుల కల్పనకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిబంధనలను సడలించింది. ఈ మేరకు బుధవారం తెలంగాణ రాష్ట్ర సాధారణ పరిపాలనా విభాగం జీవో 597ను జారీ చేసిందని తెలంగాణ పీఆర్‌టీయూ అఽధ్యక్ష, కార్యదర్శులు పి. వెంకట్‌రెడ్డి, పి. సరోత్తంరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జీవో ప్రకారం మరణించిన ఉపాధ్యాయ, ఉద్యోగుల సంబంధీకులకు కారుణ్య నియామకాలు, పదోన్నతులకు అవకాశం ఏర్పడిందని వారు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి సచివాలయ పోస్టులకు ఈ సడలింపు వర్తించదని తెలిపారు. ఉపాధ్యాయుల పదోన్నతులకు విద్యాశాఖ నుంచి ప్రత్యేక ఉత్తర్వులు రావాల్సి ఉందని వారు వివరించారు.