Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 18 2014 @ 03:03AM

సరిహద్దులో అప్రమత్తం


చింతూరు: మావోయిస్ట్టు పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని ఈనెల 21న ఘనంగా నిర్వహించేందుకు నక్సల్స్‌ సిద్ధమయ్యారు. ఇప్పటికే మావోయిస్టులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌, ఒడిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రల సరిహద్దు గ్రామాల్లో కరపత్రాలు, పోస్టర్లు పంచడంతో పాటు అమర వీరుల స్థూపాలను కూడా ఏర్పాటు చేసే అవకాశమున్నందున పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా జాతీయ రహదారుల గుండా ప్రయాణించే వాహనాలతో పాటు వారాంతపు సంతల్లో కూడా పోలీసులు తనఖీలు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా సరిహద్దు రాష్ట్రాల పోలీసులు ఎప్పటి కపుడు మావోస్టుల కదలికలపై నిఘాపెట్టి అవసరమగు చర్యలు చేపడుతున్నారు. ఇదిలా ఉండగా.. మావోయిస్టుల హిట్‌ లిస్టులలో ఉన్న రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేసినట్లు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. సరిహద్దు రాషా్ట్రలైన ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్‌ నుంచి మావోయిస్టులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రలలోకి చొరబడి ఏదైనా విధ్వంసాలు సృష్టించే ప్రమాదాలు లేకపోలేదన్న అనుమానంతో ఇప్పటికే సరిహద్దులను పోలీసులు ఆదీనంలోకి తీసుకొన్నారు. ఇందులో బాగంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కూంబింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ళీఠిట శ్రీవఉ