Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 18 2014 @ 02:02AM

మెదక్‌ ఉప ఎన్నిక విజయంతో మా బాధ్యత పెరిగింది-డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి


మెదక్‌ టౌన్‌: మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు ప్రజలు కట్టబెట్టిన భారీ మెజార్టీతో తమ ప్రభుత్వ బాధ్యతను మరింత పెంచిందని ఉపసభాపతి పద్మారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక క్యాంప్‌ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో దేశంలోనే ఎవరికీ దక్కని మెజార్టీని ప్రభాకర్‌రెడ్డికి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్‌ వంద రోజుల పాలనకు ఇదే మద్దతన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాల ప్రణాళికలకు ప్రజలు మద్దతు పలికారన్నారు. రుణమాఫీ, సమగ్ర సర్వే, గృహ నిర్మాణాలపై ఇతర పార్టీ నేతలు ఎన్ని విమర్శలు చేసినా, ప్రజలు టీఆర్‌ఎస్‌నే నమ్మారన్నారు. ఈ తీర్పుతో ప్రజారంజక పాలనను అందిస్తామన్నారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.20.63 లక్షల చెక్కును 37 మంది లబ్ధిదారులకు పద్మారెడ్డి అందజేశారు. ఆమె వెంట జట్పీటీసీ లావణ్యరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌, ఎంపీపీ లక్ష్మి, జిల్లా నాయకులు గంగాధర్‌, ఆకిరెడ్డి క్రిష్ణారెడ్డి, జయరాంరెడ్డి, చింతల నర్సింలు, బాలరాజు, జీవన్‌రావు ఉన్నారు.

్గల3