Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 18 2014 @ 00:38AM

వాటర్‌గ్రిడ్‌ ద్వారా..నిరంతర తాగునీరు..!

శ్రీకాకుళం: రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో వాటర్‌గ్రిడ్‌ ద్వారా నిరంతర తాగునీటి సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ తెలిపారు. బుధవారం రాత్రి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్‌ ఇంజనీర్లు, గ్రామీణ నీటి సరఫరా ఇంజనీరింగ్‌ అధికారులతో జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పథకం అమలుకు ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో పాటు ఎనిమిది మంది నిపుణులతో ప్రత్యేక కమిటీని నియమించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కమిటీ అధికార యంత్రాంగంతో సమీక్ష, సమావేశం నిర్వహించి స్థానిక అధికారుల సలహాలు, సూచనలు తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పథకానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గుజరాత్‌లో ఈ పథకం విజయవంతమైందన్నారు. జిల్లాలో వంశధార, నాగావవళి నదుల మిగుల జలాలగురించి వంశధార పర్యవేక్ష ఇంజనీర్‌ను అడిగితెలుసుకున్నారు. జిల్లాలో ఈ నదుల నుంచి పైపుల ద్వారా నీరు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై పర్యవేక్షక ఇంజనీర్‌ను మంత్రిఅడిగి తెలుసుకున్నారు. జిల్లాకు 1.7 టీఎంసీల నీరు అవసరముందని వంశధార పర్యవేక్షక ఇంజనీర్‌ తెలిపారు. జిల్లాలో వాటర్‌గ్రిడ్‌ ద్వారా ఎన్ని నీటిసరఫరా ట్యాంకులు అవసరమో వివరాల్ని తమకు అందజేయాలని ఇంజనీరింగ్‌ అధికారుల్ని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో విశాఖపట్టణం జిల్లా కలెక్టర్‌ యువరాజ్‌, విజయనగరం కలెక్టర్‌ ఎం.ఎం.నాయక్‌ మాట్లాడుతూ వారి జిల్లాలకు ఈ పథకం ద్వారా నదుల వివరాలు, ఎంతనీరు అవసరమో అనే వివరాల్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సమావేశంలో పార్లమెంట్‌సభ్యులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకులు వాణీమోహన్‌, గ్రామీణ నీటి సరఫరా చీఫ్‌ ఇంజనీర్‌ కె.రవిబాబు, రాష్ట్ర పురపాలక చీఫ్‌ ఇంజనీర్‌ పాండురంగారావు, పోలవరం పర్యవేక్షక ఇంజనీర్‌ ఎంటీ రాజు, మూడు జిల్లాల అధికారులు పాల్గొన్నారు.
అలసత్వం వహిస్తే కఠినచర్యలు
పాతశ్రీకాకుళం: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠినచర్యలు తప్పవని మంత్రి నారాయణ హెచ్చరించారు. పలు సమస్యలపై అడిగిన ప్రశ్నలకు శ్రీకాకుళం మున్సిపల్‌ అధికారుల నుంచి సమాధానం లభించకపోవడం...అడిగిన ప్రతిప్రశ్నకు మౌనం వహించ డంతో ఇద్దరు మంత్రులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పురపాలక శాఖ మంత్రి మాట్లాడుతూ ఓ విజన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డు వంద రోజుల ప్రణాళికను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలకు ప్రవే శపెడితే మీరు మాత్రం అరకొర సమాచారంతో వుంటే ఎలా అని సుతి మెత్తగా హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్‌ చేస్తామన్నారు. డంపింగ్‌యార్డు పనులు శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మంచినీటి సరఫరా, విద్యుత్‌ లైట్లు, పారిశుధ్యం ప్రణాళికబద్ధంగా చేపట్టాలని తెలిపారు.