Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 18 2014 @ 00:33AM

ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలకు సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌

(ఆంధ్రజ్యోతి, ఆదిలాబాద్‌)
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జిల్లా, జోనల్‌, మల్టి జోనల్‌ ఉద్యోగులకు సంబంధించి పదోన్నతుల, బదిలీ పై ఉన్న ఆంక్షలను తొలగించి ఈ ప్రక్రియను నిర్వహించేందు కోసం రాష్ట్ర ప్రభుత్వం బుధ వారం రాత్రి జీవో నెంబర్‌ 595ను జారీ చేసింది. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్ర విభజన సందర్భంగా కొనసాగుతున్న పదోన్నతులు, బదిలీల సంక్షోబానికి ఈ జీవో ద్వారా తెరపడింది. జిల్లా, జోనల్‌, మల్టి జోనల్‌కు సంబంధించిన ఉద్యోగులకు వారి వారి సీనియార్టీ ప్ర కారం పదోన్నతులు లభించబోతున్నాయి. అలాగే యేండ్ల తరబడి నిలిచి పోయిన బదిలీ లు కూడా ఆయా శాఖల ద్వారా ఇక జరుగనున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖలు ఇప్పటికే పదోన్నతులకు సంబంధించిన జాబితాలను సిద్ధం చేసి ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ప్రభుత్వం జీవో జారీ చేయడంతో ఉద్యోగుల ఎదురుతెన్నులకు తెరపడినట్లయింది.