Sep 18 2014 @ 00:33AM

ప్రభుత్వ శాఖల మధ్య భూ వివాదం

(ఆంధ్రజ్యోతి, మంచిరాల)
అటవీ శాఖ, రెవెన్యూ శాఖల మధ్య నెలకొన్న భూ వివాదం మధ్య తరగతి, సామాన్య రైతులను ఇ బ్బందులకు గురిచేస్తోంది. వ్యవసాయం మీదనే ఆ ధారపడి జీవిస్తున్న సన్నకారు రైతులకు భూమి లే దంటూ అటవీశాఖ బెదిరింపులకు పాల్పడుతోం ది. ఆ భూమి మీదేనని సేద్యం చేసుకోవచ్చని, మరో వైపు రెవెన్యూ చెప్పుకొస్తోంది. ఈ రెండు శాఖల మ ధ్య రైతాంగం నలిగిపోతోంది. దిక్కుతోచని స్థితిలో తమ సమస్యను పరిష్కారం కోసం ఆమ రణ నిరాహార దీక్ష చేయాలని రైతాంగం నిర్ణయించుకుంది. చెన్నూర్‌ మండలంలోని ఆస్నాద్‌ గ్రామంలో 35 సంవత్సరాల కాలం నుంచి గ్రామ సరిహద్దు అటవీ ప్రాంతంలో అనుకొని ఉన్న బంజరు భూముల వి వాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. అటు రె వెన్యూ ఇటు అటవీ శాఖ అధికారుల మధ్య వివాదం కొనసాగుతున్నందున రైతులు అన్యాయానికి గురవుతున్నారు. రైతులకు ఇంత వరకు ఎలాంటి న్యాయం జరగలేదు. సోమవారం మధ్యాహ్నం గ్రామానికి వ చ్చిన డీఎఫ్‌ఓ, ఆర్డీవో అధికారులు వచ్చి పరిస్థితిని రైతుల వద్ద అడిగి తెలుసుకున్నారు. రైతుల సమాచారం మేరకు ఈ వివాదం వివరాలు ఇలా ఉన్నా యి. మండలంలోని అస్నాద ప్రజలు గత తాతముత్తాతల నుంచి ఈ గ్రామంలోనే జీవిస్తున్నారు. అం దువల్ల వారసత్వంగా తల్లిదండ్రుల నుంచి ఎలాంటి భూములు తమకు సంక్రమించాయని వారు తెలిపారు. 1954 సంవత్సరంలో రైతులకు గ్రామంలోని కులవృత్తుల వారికి అప్పటి ప్రభుత్వ అధికారులు ఇ నాం భూములిచ్చారని, అవే కాకుండా రైతులకు ప ట్టాభూములు కూడా ఉన్నాయని అలాంటి భూ ములకు 302 సర్వేనెంబర్‌ కల్గియున్నాయన్నారు. కానీ 1971-72 సంవత్సరంలో ఆ నెంబరు గల భూములకు కొత్త నెంబర్లు 582, 729, 701, 730 సర్వేనెంబర్లుగా నమోదు చేసి ఇచ్చారని రైతులు తెలిపారు. అదే నెంబర్ల ద్వారా ఇప్పటికీ అర్హులైన రైతులు భూ ములను సాగుచేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నెం బర్లలో మొత్తం 754 ఎకరాల బూమి ఉన్నట్లు తెలిపారు. అందులో 450 ఎకరాల భూమి మాత్రమే రైతుల వద్ద పట్టాలుగా మారిందన్నారు. అధికారులు 302 సర్వేనెంబర్‌ మార్పుచేసిన తర్వాత మారిన 562 సర్వేనెంబర్‌ రికార్డుల్లో లేదని ఆ 450 ఎకరాల భూమిని 1982-2010 మధ్యలో గ్రామంలో జరిగిన సెటిల్‌మెంట్‌ అధికారుల బృందం పర్యటించి గ్రా మంలో ఎవరికి చెప్పకుండానే ఎలాంటి సమాచారం రైతులకు పట్టాదారులకు తెలపకుండానే సెటిల్‌మెం ట్‌ అధికారి దురుసుగా ప్రవర్తించి 450 ఎకరాల రెవె న్యూ భూమిని ఇందులో అటవీశాఖదని రికార్డుల్లో నమోదు చేసి ప్రభుత్వానికి పంపడం వల్ల ఇప్పుడా అటవీ అధికారులు తమను రెవెన్యూ బూమి కాదని ఇక్కడ మీ రైతులకు చెందిన భూమి లేదని దౌర్జన్యంగా భూముల్లోకి రానివ్వడం లేదని రైతులు విలపిస్తున్నారు. రైతులకు చెందిన వందల ఎకరాల భూ మి అటవీ శాఖకు, రెవెన్యూ అధికారులకు తెలవకుండానే వదిలిపోవడం వల్ల అర్హులైన పట్టాభూమి కలిగిన రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
మా భూముల్లో దిమ్మెలు పెట్టారు : మొగిలి
తర తరాలుగా తాము సాగు చేస్తున్న భూముల్లో ఫారెస్టు వా ళ్లు దిమ్మెలు కట్టిండ్రు. ఈ భూ ముల మీద పంటలు పండించుకుని బతుకుతున్నాం. వీటిని గుం జుకోవాలని చూస్తున్నరు.
తాతల నుంచి సాగు : శ్రీనివాస్‌
తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని తా ము సాగు చేసి జీవిస్తున్నాం. ఇం డ్ల పంటలు పండించుకునే బతుకులను వెళ్లదీయాలి. ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నాం.
మేము వదులుకోం : రాములు
ఎంతో కాలం నుంచి భూములను సాగు చేస్తు న్నం. ఇక్కడ పంటలు పండితేనే తాము బతికేది. ఈ భూములపై నే ఆధారపడి ఉన్నాం. వద్దంటే ఎ లా ఊరుకుంటాం.
అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం.