Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 17 2014 @ 11:54AM

కమ్యూనిస్టుల పోరాటంతోనే తెలంగాణ విలీనం సాధ్యమైంది : నారాయణ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 : తెలంగాణ విలీనం కమ్యూనిస్టుల పోరాటంతోనే సాధ్యమైందని సీపీఐ నేత నారాయణ అన్నారు. బుధవారం ఉదయం సీపీఐ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ తెలంగాణ విలీన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్న కేసీఆర్‌ ఇప్పుడు మాట మార్చడం సరికాదని మండిపడ్డారు. తప్పు చేసిన ముద్దాయిలా కేసీఆర్‌ నోరెత్తడం లేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ తీరును తెలంగాణ ప్రజలు క్షమించని నారాయణ పేర్కొన్నారు.