Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 17 2014 @ 03:46AM

సుండ్రుపుట్టులో తాగునీటి కష్టాలు

పాడేరు రూరల్‌: ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఉండడం సహజం. పట్టణంలోనే ఈ సమస్యతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనడం ఆశ్చర్యకరం. సుండ్రుపుట్టు వీధి, బక్కలపనుకు, గడ్డికాలనీలో తాగునీరు అందక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
సుండ్రుపుట్టువీధిలో 200 కుటుంబాలకు చెందిన సుమారు వెయ్యిమంది జనాభా జీవనం సాగిస్తున్నారు. అక్కడి ప్రజలకు తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వాధికారులు రామాలయం పక్కనే మంచినీటి కుండీని ఏర్పాటుచేసి దానికి ఆరు కుళాయిలు ఏర్పాటుచేసి నీటి సరఫరాను అందించేవారు. గత కొంత కాలంగా ఈ కుళాయిల్లో ఐదు మరమ్మతుకు గురికావడంతో ప్రస్తుతం ఒక్క కుళాయి నుంచి మాత్రమే నీరు సరఫరా అవుతోంది. ఈ నీరు సరిపడక వారంతా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే బక్కలపనుకులో సుమారు 150 కుటుంబాలకు చెందిన 650 మంది జీవిస్తున్నారు. అక్కడి ప్రజలకు ఒక్క బోరు మాత్రమే ఉంది. దీంతో ఆ ప్రాంత ప్రజలు తాగునీటికి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికైనా ఐటీడీఏ, ఇంజనీరింగ్‌ అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.