desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 17 2014 @ 03:29AM

కార్పొరేట్‌ స్థాయిలో విద్యాబోధన

అవనిగడ్డ : ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి కళాశాలల్లో విద్యాబోధన చేస్తున్నప్పటికీ ఎక్కువ మంది కార్పొరేట్‌ కళాశాలల వైపు దృష్టి మళ్లించటాన్ని విద్యార్థులు ఆలోచించుకోవలసిన సమయమిదని డిగ్రీ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎస్‌.జగన్మోహన్‌రావు సూచించారు. మంగళవారం కళాశాలలో కామర్స్‌ విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం కామర్స్‌ అధ్యాపకులు ఎం.రామారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్‌రావు మాట్లాడుతూ లక్షలాది రూపాయలను కార్పొరేట్‌ కళాశాలలకు చెల్లించి విద్యార్థులను చేర్పిస్తున్న తల్లిదండ్రులు ఒక్కసారి ఆ కళాశాలలో చెబుతున్న విద్య, ప్రభుత్వ కళాశాలల్లో బోధిస్తున్న విద్య, ఉత్తీర్ణత శాతాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.