Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 17 2014 @ 03:21AM

రుణ మాఫీకి డేటా ఎంట్రీ నమోదు వేగవంతం కలెక్టర్‌

కడప, అర్బన్‌: జిల్లాలో రుణమాఫీకి సంబంధించిన ఆన్‌లైన్‌ డేటాఎంట్రీ నమోదు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ క్రిష్ణారావు వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం రుణమాఫీ ఆన్‌లైన్‌ డేటా ఎంట్రీ నమోదుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రుణమాఫీకి సంబంధించి బియ్యంకార్డు, ఆధార్‌కార్డు నెబర్లు నమోదుతో పాటు అదనం గా 3కాలాలు డేటా నమోదులో చేర్చామన్నారు. బియ్యం కార్డు, ఆధార్‌కార్డు, పాస్‌పుస్తకం రెండు రోజులలోపు బ్యాంకులకు అందజేయాలని సూచించారు. ఐటీ అడ్వవైజర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ ఆఫ్‌లైన్‌ డేటా ఎంట్రీని రేపు పైలేట్‌ బేసిస్‌ ద్వారా ఆప్‌లైన్‌డేటాను టెస్ట్‌ చేసేందుకు నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రధాన కార్యరద్శి మాట్లాడుతూ వీలైనంత త్వరగా రుణమాఫీకి సబంధించిన ఆన్‌లైన్‌ డేటా ఎంట్రీ నమోదు చేయాలన్నారు. కలెక్టరు కె.వి.రమణ మాట్లాడుతూ ఆప్‌లైన్‌ ద్వారా 60 శాతం ఆంధ్రప్రగతి గ్రా మీణ బ్యాంకు వారు డేటా ఎంట్రీ నమోదు చేశారన్నారు. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సిండికెట్‌బ్యాంక్‌, ఆంధ్ర బ్యాంకులలో డేటా ఎం ట్రీ నమోదు నిదానంగా జరుగుతోందన్నారు. బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించి ఆన్‌లైన్‌ డేటా ఎంట్రీ నమోదుకు వేగవంతం చేయాలని తెలియజేశామన్నారు. ఏబ్యాంకులో ఎంత మంది లోనుకు అర్హత వున్నారో, ఎంత మందికి యాక్ట్‌వైల్‌ డేటాఎంట్రీ చేశారో బ్యాంకుల వారిగా వివరాలు తీసుకుంటే డేటా ఎంట్రీ నమోదుకు లక్ష్యలను కేటాయించి త్వరితగతిన చేసేందుకు ఆస్కారం వుంటుందన్నారు. ఎల్‌డీఎం రఘునాధ్‌రెడ్డి మాట్లాడుతూ రుణ మాఫీ సంబంధించి డేటా ఎంట్రీ ప్రతి ఒక్క అకౌంటుకు మినిమం 15 నిమిషాలు సమయం తీసుకుంటుందని, అందువల్ల ఆన్‌లైన్‌ డేటా ఆలస్యమవుతుందన్నారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు జాయింట్‌ కలెక్టర్‌ సుదర్శన్‌రెడ్డి, వ్యవసాయశా ఖ జేడీ జ్ఞానేశ్వర్‌, డీఐఓ డా. విజయ్‌కుమార్‌, డ్వామా పీడీ బాలసుబ్రమణ్యం, కలెక్టరేట్‌, ఏ.ఓ బాలక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.